Mudragada Padmanabham: ఏపీలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమార్తె క్రాంతి విభేదాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీలో ఉంటున్న తండ్రి ముద్రగడ తీరును కూతురు క్రాంతి తప్పుబట్టారు. వైసీపీ కేవలం పవన్ కళ్యాణ్ ను తిట్టడం కోసమే తన తండ్రిని వాడుకుంటుందని విమర్శలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై నిన్న ముద్రగడ స్పందించారు. కూతురు క్రాంతి ఇప్పుడు తన ప్రాపర్టి కాదని తనకు పెళ్లి చేసి అత్తరాంటికి పంపించానని అన్నారు. అంతేకాకుండా, తన కుటుంబంల్లో చిచ్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాదరంగా ఆహ్వానిస్తాం..
ఇదిలా ఉంటే, అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయంపై స్పందించారు. ముద్రగడ కుమార్తె క్రాంతి జనసేనలోకి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తామని తనకు అండగా ఉంటామని అన్నారు. అంతేకాకుండా 2029 ఎన్నికల్లో క్రాంతిని జనసేన అభ్యర్థిగా పోటీ చేయిస్తానని ప్రకటించారు. అలాగే ముద్రగడ పద్మనాభంను ఆయన కుమార్తెను విడదీసే వ్యక్తిని కాదని కామెంట్స్ చేశారు. పెద్దలు అన్నాక ఎన్నెన్నో అంటుంటారని వాటిని పడాలని అభిప్రాయపడ్డారు.
Also Read: తెలంగాణకు చల్లటి కబురు.. రేపటి నుంచి వానలే వానలు!
సిగ్గులేదా..
అయితే, తాజాగా కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ప్రెస్ మీట్ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముద్రగడ కూతురుగా క్రాంతిని ఎందుకు పరిచయం చేశారని.. తన అత్తింటి పేరు ఎందుకు వాడలేదని నిలదీశారు. తన పేరు వాడటానికి సిగ్గులేదా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ ముగ్గురు భార్యలను కూడా ఇలాగే పరిచయం చేయగలరా అని నిలదీశారు.
మీ కుటుంబాన్ని సరిదిద్దుకోండి..
పవన్ తన కూతురును అనుకూలంగా మార్చుకున్నారని ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. క్రాంతి ఇప్పుడు తన బిడ్డ కాదని అత్తింటి వారి బిడ్డని పేర్కొన్నారు. తనకు తన కుటుంబ సభ్యులకు ఏమైనా కూతురు క్రాంతిని ఇంటికి పంపించకండిని అన్నారు. మీ ఇంటి వారు పబ్ లలో దొరికారు ముందు మీ కుటుంబాన్ని సరిదిద్దుకోండి పవన్ కళ్యాణ్ అని కామెంట్స్ వేశారు. తన కుటుంబ సభ్యులను రోడ్డుకు లాగారు కాబట్టి తాను కూడా లాగవలసి వచ్చిందన్నారు.