ఆదర్శ రాష్ట్రంగా నిలిచింది
తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం-2023 సందర్బంగా ఆదివారం ఉదయం కలెక్టరేట్ ప్రాంగణంలో మంత్రి తలసాని , జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ గావించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ఉద్యమ నాయకుడు తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో 2001లో ప్రారంభించి సుమారు 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమాన్ని గాంధేయ మార్గంలో నడిపించారు. ప్రజలందరిని ఒకేతాటిపైకి తీసుకొచ్చిన ఫలితంగా జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. అనతికాలంలోనే అధ్బుత ప్రగతిని సాధించి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు, ఏడుపాయల క్షేత్రానికి రూ. 100 కోట్లు స్యాంక్షన్, బతుకమ్మ పండుగకు చీరాల పంపిణీ కార్యక్రమాలు, పల్లెసీప్రకృతి వనాలు, చివరి గమ్యం చేరడానికి వైకుంఠ ధామాలు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగు నీరు, కాకతీయ మిషన్ ద్వారా భూగర్భ జలాలు పెంపు వంటి అభివృద్ధి కార్యక్రమాలు, సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే సాధ్యమైనదని అన్నారు.
విరాట్ విశ్వకర్మ జయంతి
రూ.305 కోట్లతో మెదక్ మాస్టర్ ప్లాన్‌తో జిల్లా అభివృద్ధి పథంలో ముందుంటుందని తెలిపారు. ప్రతి గ్రామా పంచాయితీలకు 15 వెల చొప్పున మంజూరు చేసిందని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా స్వయం పరిపాలనకు, అద్భుతమైనటువంటి నూతన సమీకృత కార్యాలయాల సముదాయాలు, ఎస్‌పీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. నర్సాపూర్ పట్టణం కి రూ.25 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. 2014కి ముందు ఉన్న ప్రభుత్వాలు పట్టణాల అభివృద్ధికి ఎటువంటి నిధులు మంజూర్ ఇచ్చేవారు కాదని గుర్తు చేశారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కలెక్టర్, ఎస్పీ, ఎమ్యెల్యే, అధికారులకుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి సందర్బంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా చేతి కులత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నదని ఆయన వివరించారు.
సీఎం సంకల్పంతోనే మెడికల్ కాలేజీలు
ఎమ్మెల్యే పద్మ దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. 30 ఎకరాల 3 గంటల జాగాలో రూ.180 కోట్లతో జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైందన్నారు. త్వరలోనే మంత్రి హరీష్ రావుచే వైద్య కళాశాల పనులు ప్రారంభించుకుందామని ఎమ్మెల్యే అన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో IDOCలు ఎక్కడ లేవని, ఒకే దగ్గర ఉన్న ఆఫీసులు మన తెలంగాణలో మాత్రమే ఉన్నాయని, కౌడిపల్లి, రామాయంపేట మండలాలలో డిగ్రీ కళాశాల మంజూరు చేయడం, మన జిల్లా అభివృద్ధికి తార్కాణమన్నారు. సీఎం సంకల్పంతోనే నెరవేరుతున్నాయని అన్నారు. వివిధ శాఖల అధికారులు , కౌన్సిలర్లు , జడ్‌పీటీసీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.