MS Dhoni : హ్యాపీ బర్త్ డే మిస్టర్ కూల్.. మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక సారథి!

భారత మాజీ క్రికెటర్ ధోనీ నేడు తన 43వ బర్త్‌డే జరుపుకుంటున్నాడు. దూకుడు బ్యాటింగ్‌తో టీమిండియాలోకి దూసుకొచ్చి భారత జట్టు వెన్నెముకగా మారాడు. తొలి టీ 20 ప్రపంచకప్‌, రెండో వన్డే ప్రపంచకప్‌, ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలు అందించిన ఏకైక భారత కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయాడు.

New Update
MS Dhoni : హ్యాపీ బర్త్ డే మిస్టర్ కూల్.. మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక సారథి!

Rohit Sharma : రోహిత్‌ శర్మ....! టీ20 వరల్డ్‌కప్‌ (T20 World Cup) విక్టరీ తర్వాత యావత్‌ క్రికెట్‌ ప్రపంచం హిట్‌మ్యాన్‌కు సలామ్ చేస్తోంది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీ స్కిల్స్‌పై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేకున్నా గతేడాది వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌తో పాటు WTC ఫైనల్‌లో టీమిండియా (Team India) ఓడిపోవడంతో హిట్‌మ్యాన్‌పై అనేక విమర్శలు వచ్చాయి. అయితే ఏడాది తిరిగేలోపే అందరి నోర్లు మూతపడ్డాయి. 17ఏళ్ల తర్వాత టీమిండియా సగర్వంగా పొట్టి కప్‌ను ముద్దాడింది. దీంతో నాడు హిట్‌మ్యాన్‌ను తిట్టినవారే ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే కొన్నేళ్లుగా మాత్రమే క్రికెట్‌ చూస్తున్నవారికి రోహిత్‌ శర్మకు ఓ గాడ్‌ ఫాదర్‌ ఉన్నాడని తెలియదు. అతనే భారత్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ. జులై 7న 43వ బర్త్‌డే సెలబ్రెట్‌ చేసుకుంటున్నాడు ధోనీ.. ఇంతకీ రోహిత్‌ శర్మ ఎదుగుదలలో ధోనీ ఎలాంటి రోల్‌ ప్లేస్‌ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం!

టాపార్డర్‌ అంతా విఫలమైన చోట..
అది 2007 సెప్టెంబర్‌ 24.. క్రికెట్‌ చరిత్రలో తొలిసారి టీ20 ప్రపంచ కప్‌ టోర్నీ జరుగుతోంది. ఇండియా-పాకిస్థాన్‌ జట్లు ఫైనల్‌కు వచ్చాయి. ముందుగా బ్యాటింగ్‌ దిగిన టీమిండియాకు గౌతమ్‌ గంభీర్‌ పెద్ద దిక్కుగా నిలిచాడు. టాపార్డర్‌ అంతా విఫలమైన చోట 54 బంతుల్లో 75 పరుగులు చేశాడు. చాలామంది క్రికెట్‌ అభిమానులకు ఈ విషయం తెలుసు. అయితే టీమిండియా వరల్డ్‌కప్‌లో గెలవడానికి సైలెంట్ కంట్రీబ్యూషన్‌ ఇచ్చాడు రోహిత్‌ శర్మ. ధోనీ, యువరాజ్‌, రాబిన్ ఉతప్ప, యూసఫ్‌ పఠాన్‌ ఫెయిలైన ఫైనల్‌లో రోహిత్‌ శర్మ 16 బంతుల్లో 30 పరుగులుచేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ పరుగులే టీమిండియా గెలుపుకు కారణమయ్యాయి.

బ్యాటింగ్‌ టాలెంట్‌ను గుర్తించిన ధోనీ..
2007 వరల్డ్‌కప్‌లోనే టీమిండియా తరుఫున డెబ్యూ చేశాడు రోహిత్‌. అప్పుడు కెప్టెన్‌గా ధోనీ ఉన్నాడు. రోహిత్‌లోని బ్యాటింగ్‌ టాలెంట్‌ను గుర్తించిన ధోనీ అతనికి తుది జట్టులో అవకాశం కల్పించాడు. దక్షిణాప్రికాపై మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ కొట్టిన రోహిత్‌ శర్మ తర్వాత ఫైనల్‌లోనూ ఇరగదీశాడు. ఇక ఆ తర్వాత జరిగిన సిరీస్‌లు, టోర్నమెంట్లలో రోహిత్‌ ఫెయిల్ అయ్యాడు.

మ్యాగీమ్యాన్‌ అంటూ ట్రోల్..
రోహిత్‌ శర్మను 2013 ముందు వరకు అంతా మ్యాగీమ్యాన్‌ అని ట్రోల్ చేసేవారు. అంటే మ్యాగీ తయారయ్యే రెండు నిమిషాల్లోనే అతను అవుట్ అవతాడని సెటైర్లు వేసేవారు. అయితే ధోనీ (MS Dhoni) మాత్రం రోహిత్‌కు వరుస పెట్టి అవకాశాలు ఇస్తూనే వచ్చాడు. 2008 సీబీ సిరీస్‌లో ఓ మ్యాచ్ మినహా రోహిత్‌ పెద్దగా ప్రభావం చూపిన దాఖలాలు లేవు. అందుకే 2011 ప్రపంచకప్‌లో రోహిత్‌ను సెలక్ట్ చేయలేదు. అయితే 2011 వరల్డ్‌కప్‌ విక్టరీ తర్వాత భవిష్యత్‌ ఆటగాళ్లపై దృష్టి పెట్టిన ధోనీ మరోసారి రోహిత్‌ను టీమ్‌లోకీ తీసుకునేందుకు సెలక్టర్లను ఒప్పించాడు.

వరుస పెట్టి అవకాశాలు..
2012 సీబీ సీరిస్‌లో రోహిత్‌ శర్మకు వరుస పెట్టి అవకాశాలు ఇచ్చాడు రోహిత్‌. అయితే అక్కడ కూడా రోహిత్‌ అట్టర్‌ ఫ్లాప్‌. రోహిత్‌ శర్మ టాలెంట్‌లో ఎవరికీ తక్కువ కాకున్నా నిలకడలేమితో ఆడలేక నానాతంటాలు పడేవాడు హిట్‌మ్యాన్‌. అయితే 2013లో ధోనీ తీసుకున్న నిర్ణయం రోహిత్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. అప్పటివరకు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ను ధోనీ ఓపెనర్‌గా ప్రమోట్ చేశాడు. దీంతో రోహిత్‌ విశ్వరూపం ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఓపెనర్‌గా ప్రమోట్ అయిన తర్వాత ఎదురేలేకుండా దూసుకుపోయాడు రోహిత్‌. ఓపెనర్‌గా వన్డేల్లో ఏకంగా మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌ హిట్‌మ్యాన్‌!

ధోనీ అండదండలు ఎక్కువగా..
ఇలా రోహిత్‌ శర్మకు నాటి కెప్టెన్‌ ధోనీ అండదండలు ఎక్కువగా లభించాయి. ధోనీ సపోర్ట్‌తో రోహిత్‌ ఎదిగిన తీరును ఇప్పటికీ మహేంద్రుడి ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటారు. ఇలా రోహిత్‌ శర్మ కెరీర్‌లో గాడ్‌ ఫాదర్‌ రోల్‌ ప్లే చేశాడు. అయితే గురువును మించిన శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి రోహిత్‌కు ఎక్కువ కాలం పట్టలేదు. ఐపీఎల్‌లో స్ట్రాంగెస్ట్‌ టీమ్‌గా ఉండే ధోనీ సారధ్యంలోని చెన్నైని ముంబై అనేకసార్లు ఓడించింది. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ధోనీ ఎత్తుగడలకు చెక్‌ పడింది. ఇప్పటివరకు చెన్నై టీమ్‌ను ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఓడించిన జట్టు ముంబై మాత్రమే. రోహిత్‌ వర్సెస్ ధోనీలో హిట్‌మ్యాన్‌దే పైచేయి. ముందుగా ధోనీ సపోర్ట్‌తో టీమిండియాలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్న రోహిత్‌ తర్వాత ఐపీఎల్‌ కెప్టెన్సీ ప్రతిభతో 2022లో భారత్‌ జట్టు పగ్గాలు చేపట్టాడు. రెండేళ్లు తిరిగేలోపే టీమిండియాకు టీ20 వరల్డ్‌కప్‌ అందించాడు.

Also Read : ఎస్సై ప్రాణం తీసిన కుల వివక్ష.. పురుగుల మందు తాగి శ్రీనివాస్ మృతి!

#rohit-sharma #ms-dhoni #happy-birthday-dhoni #indian-cricket
Advertisment
తాజా కథనాలు