Dhoni: ఇలా అంతా అయిపోయాక కొట్టే బదులు ముందే దిగొచ్చు కదా సర్!

విశాఖ గడ్డపై 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు ధోనీ. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీపై చెన్నై ఓడిపోయింది. ధోనీ అభిమానులను అలరించినా అతను బ్యాటింగ్‌కు దిగే సమయానికి మ్యాచ్‌ చేజారిపోయింది. దీంతో ధోనీ ముందు బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

New Update
Dhoni: ఇలా అంతా అయిపోయాక కొట్టే బదులు ముందే దిగొచ్చు కదా సర్!

CSK vs DC: మ్యాచ్‌ చేజారిపోయిన తర్వాత బ్యాటర్లపైనా, బౌలర్లపైనా, ఎవరిపైనా ఒత్తిడి ఉండదు. ఆ టైమ్‌లో ఆడడం వేరు.. టఫ్‌ ఫైట్‌ ఉన్నప్పుడు చెలరేగడం వేరు. ఐపీఎల్‌లో ధోనీ (MS Dhoni) బ్యాటింగ్‌ పొజిషన్‌ మూడేళ్లగా కిందకు పడిపోతూ వచ్చింది. గతంలో జట్టు అవసరాలకు తగ్గట్టుగా ధోనీ తన బ్యాటింగ్‌ పొజిష్‌ను మార్చుకునేవాడు. ఇప్పుడా పరిస్థితి లేదు. గతేడాది కూడా ధోనీ బ్యాటర్లందరూ ఔటయ్యాక చివరిలో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. ఒకటి రెండు బంతులు ఆడి సిక్సో, ఫోరో కొట్టి ఫ్యాన్స్‌ను అలరించేవాడు. నాడు గుజరాత్‌పై ఫైనల్‌ మ్యాచ్‌లో ముందే బ్యాటింగ్‌కు వచ్చాడు కానీ డకౌట్ అయ్యాడు. ఇక తాజాగా ఢిల్లీపై విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై గెలిచే ఛాన్స్ లేదని ఫిక్స్‌ అయిన తర్వాతే మహేంద్రుడు బ్యాటింగ్‌కు వచ్చాడు.


దూబేపై నిందలు:
బాదడానికి అయితే బాదాడు కానీ అప్పటికే జట్టు ఓటమి ఫిక్స్‌ అయిపోయింది. ధోనీ ఫ్యాన్స్‌కు మాత్రం సండే మంచి బిర్యానీ ఫీస్ట్ వచ్చినట్టుయింది. అయితే ఫ్యాన్‌డమ్‌ లాంటివి పక్కన పెట్టి మాట్లాడుకుంటే ధోనీ బ్యాటింగ్‌కు దిగిన పొజిషన్‌ను విమర్శించేవారు లేకపోలేదు. హిట్టింగ్‌ చేయగల సమార్థ్యం ఇంకా ఉన్నా తనకంటే ముందు ఇతర బ్యాటర్లు దిగారు. చివరకు చెన్నై ఫ్యాన్స్‌ దూబేను, జడేజాను బ్లే్మ్ చేస్తున్నారు. వాళ్లు దిగినప్పుడు ఆట పరిస్థితి వేరు.. ధోనీ దిగే టైమ్‌కు ఉన్న పరిస్థితి వేరు. చెన్నై ఓటమి ఫిక్స్‌ అయిపోయాక ఢిల్లీ బౌలర్లు రిలాక్స్ అయ్యారు. ఇటు ధోనీ స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసుకున్నాడు. ఇదేదో ముందే బ్యాటింగ్‌కు వచ్చి బాది ఉంటే రిజల్ట్‌ వేరేలా ఉండదన్నది కొందరి వాదన.. అయితే మూడేళ్లుగా ధోనీ ప్రెజర్‌లో దిగినప్పుడు కొన్ని సార్లు మాత్రమే సక్సెస్ అయ్యాడు. గతేడాది ముంబైపై చివరి బంతికి ఫోర్‌ కొట్టి గెలిపించాడు.

ఓడిపోయిన చెన్నై:
ఐపీఎల్‌లో (IPL) అన్‌సక్సెస్‌ఫుల్‌ ఛేజింగ్స్‌లో ధోనీ 8సార్లు నాటౌట్‌గా నిలబడ్డాడు. ఇక ఇక నిన్నటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచి బోణీ కొట్టింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మీద ఢిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగుల భారీ స్కోరు చేసింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి ఓడిపోయింది.

Also Read: గ్యాస్ సిలిండర్ పై రూ.32 తగ్గింపు

Advertisment
Advertisment
తాజా కథనాలు