తెలంగాణలో మెజార్టీ శాతం ఉన్న మాదిగలను పట్టించుకొని కాంగ్రెస్‌కు.. మాదిగలను ఓట్లు అడిగే హక్కు లేదని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ఓట్ల కోసం వస్తే.. కాంగ్రెస్ నాయకులను తరిమి కొడతామంటూ హెచ్చరించారు. సూర్యాపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగల ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
Also Read: టాప్ యంగ్ గేమర్స్‌తో కలిసి గేమ్స్ ఆడిన ప్రధాని మోదీ..
ఇప్పటికైనా ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో మాదిగలకు ఛాన్స్ ఇవ్వాలని.. అలాగే ఇప్పటికే ప్రకటించిన స్థానాలను మార్చి రెండు పార్లమెంట్ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాన్ని కూడా మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాలలకు పెద్ద పీట వేస్తోందని.. తమ ఓట్లతో నాయకుడిగా ఎదిగిన రేవంత్ మాదిగలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాల కావడం వల్లే మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఆరోపణలు చేశారు.
Also Read: ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పిన యువతి.. తీరాచూస్తే షాక్