/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/supreme-jpg.webp)
పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేల అవినీతికి సంబంధించి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా లంచాలు తీసుకుంటే.. ఈ కేసు నుంచి తప్పించుకోలేరని తెలిపింది. పార్లమెంటు, అసెంబ్లీలో.. ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రసంగించేందుకు, ఓటు వేసేందుకు, ప్రశ్నలు అడిగేందుకు లంచాలు తీసుకున్నట్లైతే ఎవరైనా కూడా ఈ కేసులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే సుప్రీంకోర్టులో ఎంపీ, ఎమ్మెల్యేలకు సంబంధించి లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ అంశంపై తాజాగా విచారణ జరిగింది.
Also read: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. కేంద్రం కీలక నిర్ణయం
చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం ఈ అంశంపై విచారణ చేసింది. లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ లేదని తెలిపింది. పార్లమెంటు, అసెంబ్లీలలో చట్టసభ సభ్యులు లంచాలు తీసుకుంటే ఎవరైనా కూడా తప్పకుండా విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఏకగ్రీవ తీర్పునిచ్చింది.
అయితే చట్టసభల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకొని ఓటు వేసే అంశంపై 1998లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పులో ఎంపీ, ఎమ్మెల్యేలు లంచం తీసుకుంటే రాజ్యాంగ రక్షణ కల్పించేలా తీర్పునిచ్చింది. కానీ ఈ వ్యవహారంపై తాజాగా విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. 1998 నాటి ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. చట్టసభల్లో లంచాలు తీసుకుంటే ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఎంపీ, ఎమ్మెల్యులు లంచం తీసుకోవడం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని సీజేఐ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
Also Read: నేను రాజీనామా చేస్తున్నా…హైకోర్టు జడ్జి సంచలన నిర్ణయం..!
Seven-judge Constitution bench of the Supreme Court rules that an MP or MLA can't claim immunity from prosecution on a charge of bribery in connection with the vote/speech in the Parliament/ Legislative Assembly.
Supreme Court’s seven-judge bench in its unanimous view overruled… pic.twitter.com/xJ4MRWvpoO
— ANI (@ANI) March 4, 2024