Mpox: భయపెడుతున్న మంకీపాక్స్‌.. కేంద్రం కీలక ఆదేశాలు

ప్రస్తుతం ఎంపాక్స్‌ (Mpox) వైరస్ కలకలం రేపుతోంది. మొన్నటివరకు ఆఫ్రికాను టెన్షన్‌ పెట్టిన ఈ వైరస్ ఇప్పుడు ఇతర దేశాల ప్రజలను భయపెడుతోంది. ఈ నేపథ్యంలో దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను తరలించాలని కేంద్రం ప్రభుత్వం.. ఆస్పత్రులను ఆదేశించింది.

Mpox: భయపెడుతున్న మంకీపాక్స్‌.. కేంద్రం కీలక ఆదేశాలు
New Update

మంకీపాక్స్‌..! ఈ పేరు వింటేనే ప్రజలు గజగజా వణికిపోతున్నారు.. కరోనా కంటే యమ డేంజరస్‌ డిసీజ్ ఇది.. సోకితే అంతే సంగతి..! అసలు మంకీపాక్స్‌కు సంబంధించిన ఫొటోలను చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. మొన్నిటివరకు ఆఫ్రికాను టెన్షన్‌ పెట్టిన మంకీపాక్స్‌ ఇప్పుడు ఏషియా దేశాల్లోని ప్రజలను భయపెడుతోంది. ఎందుకంటే పాకిస్థాన్‌లో మంకీపాక్స్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో మంకీపాక్స్‌ కేసు నమోదవడంతో జమ్ము ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అటు ఫిలిప్పీన్స్‌లోనూ కేసులు రికార్డవడంతో ఇండియా అప్రమత్తమైంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న Mpox కేసుల దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అప్రమత్తంగా ఉండాలని ఎయిర్‌పోర్టు, సీ పోర్టు అధికారులను ఆదేశించింది. మంకీపాక్స్‌ ముప్పును ఎదుర్కొనేందుకు ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డుల ఏర్పాటుతో పాటు విమానాశ్రయాల్లో అలెర్ట్ ప్రకటించింది కేంద్రం. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను తరలించాలని ప్రభుత్వం ఆస్పత్రులకు ఆర్డర్ పాస్ చేసింది.

Also Read: ఏడు గంటలుగా రైలు ట్రాక్ పైనే..ఉరి తీసే వరకు అంటూ నిరసనలు

ఢిల్లీలోని మూడు నోడల్ ఆస్పత్రులు-సఫ్దర్‌జంగ్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్స్‌ను ఎంపాక్స్‌ కోసం కేటాయించారు. అనుమానిత రోగులపై RT-PCRతో పాటు నాజిల్ స్వాబ్ పరీక్షలు చేయనున్నారు. ఇక మంకీపాక్స్ సోకిన 5 నుంచి 20 రోజులలోపు సంబంధిత వ్యక్తిలో లక్షణాలు కనిపిస్తాయి. బాధితులకు తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, కళ్ళు ఎర్రబడటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 2022లో కూడా ఈ మంకీపాక్స్‌ వ్యాధి దాదాపు 100 దేశాలపై దాడి చేసింది. వేలాది మందిని అనారోగ్యానికి గురి చేసింది. ఆ సమయంలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నిజానికి మంకీపాక్స్ కరోనా అంత ప్రాణాంతకం కాదట. అయితే ఎంతోకొంత ప్రాణ నష్టం మాత్రం కచ్చితంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రత్యేకించి మరేదైనా ప్రాణాంతక వ్యాధితో బాధపడే వారికి మంకీపాక్స్‌ సోకితే చాలా డేంజర్‌ అని చెబుతున్నారు.

1958లో మంకీపాక్స్‌ను తొలిసారిగా గుర్తించారు. ఈ వ్యాధి ఆర్థోపాక్స్ వైరస్ వల్ల వస్తుంది. ఈ వ్యాధి కాస్త చికెన్‌ పాక్స్‌ను పోలి ఉంటుంది. చికెన్ పాక్స్ లాగా చీము నిండిన దద్దుర్లు శరీరంపై కనిపిస్తాయి. అయితే ఈ దద్దర్లు పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి లేదా ఎలుకలు, లేదా ఇతర జంతువుల ద్వారా మంకీపాక్స్‌ వ్యాపిస్తుంది. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే తరచుగా చేతులు కడుక్కోవాలి. ఎలుకలు, ఇతర జంతువులను ఇంట్లోకి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వీధి కుక్కలకు కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాధి సోకిన రోగి ఇంట్లో ఉంటే మిగతా వారందరూ బాధితుడిగా దూరంగా ఉంటూ మాస్క్ ధరించాలి.

గతంలో భారత్‌లో మంకీపాక్స్ కేసులు నమోదైనా, తాజాగా ఇప్పటివరకు ఒక కేసు కూడా నమోదు కాలేదు. ఇంతకు ముందు మంకీపాక్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రబలినపుడు ఇండియాలోనూ కొన్ని కేసులు నమోదయ్యాయి. 2023 జులై 24 నాటికి దేశంలో 27 మంకీపాక్స్ కేసులు నమోదైనట్లు నాడు కేంద్రం ప్రకటించింది. వాటిలో 12 కేసులు కేరళలో, 15 కేసులో ఢిల్లీలో బయటపడ్డాయి. ఇక 2024లో ఇండియాలో ఇప్పటివరకు ఒక్క కేసు నమోదుకాకున్నా తాజాగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కేసు రికార్డవుడంతో అంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Also Read: బట్టలు విప్పి, ప్రైవేట్ పార్ట్‌ టచ్‌ చేస్తూ.. బాలికల అత్యాచార ఘటనలో షాకింగ్ నిజాలు!

#telugu-news #national-news #mpox
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి