Monkeypox: ఇండియాలో మంకీపాక్స్ కలకలం.. ఆస్పత్రిలో అనుమానితుడు

ఇటీవల ఆఫ్రీకా నుంచి ఇండియాకు వచ్చిన ఓ వ్యక్తిలో ఎంపాక్స్ లక్షణాలు ఉన్నాయని అనుమానంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అతనిలో ఎంపాక్స్ వైరస్‌ లక్షణాలు ఉన్నాయా ? లేవా ? అని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొంది.

New Update
Monkeypox: ఇండియాలో మంకీపాక్స్ కలకలం.. ఆస్పత్రిలో అనుమానితుడు

కరోనా వైరస్‌ తర్వాత ప్రపంచాన్ని మరోసారి కలవరపెడుతున్న వైరస్ మంకీపాక్స్. ఇప్పటివరకు కేవలం ఆఫ్రీకా దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ వైరస్ అమెరికా, యూకే, ఫిలిప్పైన్స్‌ దేశాలకు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఇటీవల పాకిస్థాన్‌లో కూడా పలు మంకీ పాక్స్‌ కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా మన ఇండియాలో కూడా తొలి మంకీపాక్స్ కేసు నమోదైందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇటీవల ఆఫ్రీకా నుంచి ఇండియాకు వచ్చిన ఓ వ్యక్తిలో ఎంపాక్స్ లక్షణాలు ఉన్నాయని అనుమానంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Also Read: అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం: సీఎం రేవంత్

ప్రస్తుతం ఆ వ్యక్తిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పింది. అయితే అతనిలో ఎంపాక్స్ వైరస్‌ లక్షణాలు ఉన్నాయా ? లేవా ? అని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొంది. ప్రోటోకాల్‌లకు అనుగుణంగా ఆ వ్యక్తిపై పరీక్షలు జరుగుతున్నాయని.. వైరస్ మూలాలు గుర్తించడానికి కాంటాక్ట్‌ ట్రేసింగ్ కొనసాగుతుందని పేర్కొంది. ఎంపాక్స్ విషయంలో ఆందోళన చెందొద్దని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు