అవిశ్వాస తిర్మానంపై రెండోరోజు లోక్సభ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన తెలంగాణ ఎంపీ నామా నాగేశ్వర్రావు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇవ్వకపోయినా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందంజలో ఉందని ఎంపీ తెలిపారు. రాష్ట్రంలోని కాజీపేటకు రైల్వే కోచ్కును కేటాయించాలని కేంద్రానికి ఎన్నో సార్లు లేఖలు రాశామని, లేఖలు రాసినా పట్టించుకోకపోవడంతో స్వయంగా మంత్రులతో మాట్లాడామని ఆయన గుర్తు చేశారు. కానీ కేంద్రం మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను కేటాయించినట్లు ఎంపీ తెలిపారు.
పూర్తిగా చదవండి..కేంద్రంపై ఏంపీ నామా నాగేశ్వర్రావు ఆగ్రహం
లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ జరిగింది. దీనిపై మాట్లాడిన ఎంపీ నామా.. విభజన చట్టం హామీలను నెరవేర్చాలని 9 ఏంళ్లుగా కేంద్రాన్ని కోరుతున్నప్పటికీ, ఎలాంటి స్పందన లేదన్నారు. కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది ఎంపీ నామా నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు
Translate this News: