Congress Party: ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కీలక స్థానం కల్పించిన అధిష్టాం..

నల్లగొండ జిల్లాలో కీలక నేత అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది పార్టీ అధిష్టానం. ఆయనకు అత్యంత కీలక బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలోకి తీసుకుంది. ఆయనను మాత్రమే కాదు.. మరో సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌ను కూడా స్క్రీనింగ్ కమిటీలోకి తీసుకుంది పార్టీ అధిష్టానం.

Congress Party: ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కీలక స్థానం కల్పించిన అధిష్టాం..
New Update

MP Komatireddy Venkat Reddy as Screening Committee Member: తెలంగాణ కాంగ్రెస్‌లో(Congress) ఆయనో సీనియర్ లీడర్.. పలు నియోజకవర్గాలను ప్రభావితం చేయగల సత్తా ఆయన సొంతం.. పంతం పట్టారంటే జరిగి తీరాల్సిందే.. కానీ, పరిస్థితులు ఆయనకు అనుకూలించలేదు.. తెలంగాణ(Telangana) ఏర్పాటు తరువాత ఆయన ఆశించిన పదవి దక్కలేదు. ఇంకేముంది.. అలకలు, అరుపులు, సెన్సేషన్ కామెంట్స్ కామన్ అయిపోయాయి. పార్టీలో ఉంటూనే ఇటు రాష్ట్ర నాయకత్వంతో కయ్యానికి దిగారు. సెన్షేషన్ కామెంట్స్ కూడా చేశారు. ఒకానొక దశంలో ఆయన పార్టీని వీడుతారా? లేక పార్టీనే ఆయన్ను తొలగిస్తుందా? అనేంత వరకు వెళ్లింది మ్యాటర్. ఇదంతా తన సీనియారిటీకి ఫలితం దక్కలేదనే బాధతోనే అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కూడా. ఆయన మరెవరో కాదు.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

నల్లగొండ జిల్లాలో కీలక నేత అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది పార్టీ అధిష్టానం. ఆయనకు అత్యంత కీలక బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలోకి తీసుకుంది. ఆయనను మాత్రమే కాదు.. మరో సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌ను కూడా స్క్రీనింగ్ కమిటీలోకి తీసుకుంది పార్టీ అధిష్టానం. దాంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారంటూ పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది.

తెలంగాణ ఏర్పాటు తరువాత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ చీఫ్‌గా నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో.. పొన్నాలను తప్పించి నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించింది. పార్టీకోసం ఆయన చాలా కష్టపడ్డారు. అధికార బీఆర్‌ఎస్(నాటి టీఆర్‌ఎస్) పార్టీపై పోరు గట్టిగానే సాగించారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. నిరంతరం వర్గ పోరుతో కాంగ్రెస్ సతమతం అవుతూ వచ్చింది. ఇంతలో రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి.. టీడీపీని వీడి కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. దివంగత నేత జైపాల్ రెడ్డి బంధువు కావడం, స్వతహాగా ఆయనకు మాస్ ఫాలోయింగ్ ఉండటంతో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఏకంగా టీపీసీసీ చీఫ్‌ పదవికి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగారు రేవంత్. ఈ క్రమంలోనే.. పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా నియమించింది. ఆ ఒక్క నిర్ణయంతో తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్త జ్వాలలు అగ్ని పర్వతంలా బద్దలయ్యాయి. పార్టీలోని సీనియర్ లీడర్లలో చాలామంది రేవంత్ నియామకాన్ని ఆంగీకరించలేదు. బహిరంగంగానే ఈ విషయాలపై కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇక టీపీసీసీ చీఫ్ పదవిని ఆశించిన కోమటిరెడ్డి అయితే.. నెక్ట్స్ లెవల్ కామెంట్స్‌తో విరుచుకుపడ్డారు. అసలు గాంధీ భవన్‌లోనే అడుగు పెట్టనంటూ ప్రతిన బూనారు. రేవంత్ నేతృత్వంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ కోమటిరెడ్డి సహకరించలేదని అంటుంటారు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాకుండా.. బీజేపీ నుంచి పోటీ చేసిన తన సోదరుడికి సపోర్ట్‌గా నిలిచారు. ఆ ఘటన అప్పుడు సెన్సేషన్‌గా నిలిచించి మొత్తానికి అలా అలా కొనసాగుతూ వచ్చిన అసంతృప్తులు, వివాదాలు.. ఇటీవలి కాలంలో కాసింత చల్లబడ్డాయి. ఇక లేటెస్ట్‌గా పార్టీ అధిష్టానం ఆయనకు కీలక పోస్ట్ ఇవ్వడంతో ఆ అసంతృప్తి కూడా తొలగిపోతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరి కోమటిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Also Read:

Telangana: గురుకుల అభ్యర్థులకు అలర్ట్.. నేటి నుంచి ప్రిఫరెన్స్ ఆప్షన్స్.. పూర్తి వివరాలివే..

Vande Bharat Express: కాచిగూడ నుంచి మరో ‘వందేభారత్’ ట్రైన్ సర్వీస్ ప్రారంభం.. పూర్తి వివరాలివే..

#telangana-news #telangana-elections #telangana-congress #komatreddy-venkat-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe