Kangana Ranaut: రైతు ఉద్యమంపై మళ్ళీ నోరు పారేసుకున్న కంగనా

బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గతంలో రైతుల ఆందోళనలపై నోరు పారేసుకున్న ఆమె మళ్ళీ వాటిని బంగ్లాదేశ్ అల్లర్లతో పోలుస్తూ వ్యాఖ్యలు చేసింది. ఈ సారి కంగనా కామెంట్స్‌పై సొంతపార్టీ సైతం మండిపడుతోంది.

New Update
Kangana Ranaut: కంగనా రనౌత్‌కు హైకోర్టు నోటీసులు

Kangana Ranaut: నోటికచ్చినట్టు మాట్లాడ్డం బీజేపీ ఎంపీ కంగానకు కొత్తేమీ కాదు. ఇప్పటికి ఆమె చాలసార్లో అవకతవకగా మాట్లాడి నవ్వుల పాలైంది. రైతుల ఉద్యమం గురించి ఆమె చేఇన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుఆరం కూడ రేపాయి. రీసెంట్‌గా ఒక ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ చేతిలో చెంపదెబ్బ దెబ్బ కూడా తింది కంగనా. అయినా కూడా బుద్ధి రాలేదు. ఎంపీ అయినా కూడా బాధ్యత తెలియడం లేదు. ఇంకా అలాగే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ వివాదస్పదం అవుతోంది.

ప్రతిపక్షాలపై విమర్శల గుపించాలనే ఉత్సాహంలో అనవర విషాలు కూడా మాట్లాడేతోంది కంగనా. తాజాగా మళ్ళీ రైతులు చేసిన, చేస్తున్న నిరసనల గురించి వ్యాఖ్యలు చేసింది. వాటిని బంగ్లాదేశ్ అల్లర్లతో పోలుస్తూ కామెంట్స్ చేసింది. అన్నదాతలు చేపట్టిన నిరసనలను కట్టడి చేసేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టకుంటే ఇవి బంగ్లాదేశ్‌ తరహా అశాంతి పరిస్ధితులకు దారితీసే అవకాశం ఉందని కంగనా రనౌత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరాటంలో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని.. ఆ పోరాటంలో లైంగిక దాడులు కూడా చోటు చేసుకున్నాయని కంగనా రనౌత్ అంది. బంగ్లాదేశ్‌లో ఏం జరిగిందో భారత్‌లో కూడా అదే జరిగే అవకాశం ఉందని.. ఇందుకు విదేశీ శక్తులు కుట్రలు చేశాయని కంగనా రనౌత్ ఆరోపించింది. దేశం కుక్కల పాలైనా వారికేం పట్టదని తీవ్ర విమర్శలు చేసింది.

కంగన చేసిన ఈవ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఇంతకు ముందు కూడా రైతుల ఉద్యమం మీద కంగనా మాట్లాడిన మాటల మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఇప్పుడు కూడా అంతే తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే ఇంతకు ముందు ప్రజలు, ఇతర పార్టీ నేతలు మాత్రమే కంగనా వ్యాఖ్యలను ఖండంచేవారు. కానీ ఇప్పుడు సొంతపార్టీనే ఈమె మాటలను వ్యతిరేకిస్తోంది. పార్టీ పాలసీలపై మాట్లాడే అధికారం, అనుమతి కంగనా రనౌత్‌కు లేదని స్పష్టం చేసింది.

Also Read: Cricket: ఐసీసీ మహిళల టీ 20 ప్రపంచ కప్‌ షెడ్యూల్ రిలీజ్

Advertisment
Advertisment
తాజా కథనాలు