Telangana: కేసీఆరే మంచోడు.. ఎంపీ అరవింద్ షాకింగ్ కామెంట్స్..

కల్వకుంట్ల పేరు వినబడితేనే ఎప్పుడూ తిట్ల దండకం అందుకునే ఎంపీ అరవింద్.. తాజాగా సీఎం కేసీఆర్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్‌ను విమర్శిస్తూ.. ఆయన కన్నా కేసీఆర్ చాలా మంచోడని అన్నారు. రేవంత్‌కు అధికారం వస్తే మొత్తం ముంచేస్తాడని కామెంట్స్ చేశారు.

New Update
Aravind: RTV తో ఎంపీ అరవింద్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ.. రేవంత్ పొట్టోడు, కవిత క్రిమినల్ అంటూ..!

MP Aravind: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు రాగానే.. ఎమ్మెల్సీ కవిత మాయమైపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఆదివారం నాడు జగిత్యాల మెట్‌పల్లిలో మీడియాతో మాట్లాడిన అరవింద్.. సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్‌కు, రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటో మొత్తం బయటపెడతామని అన్నారు అరవింద్. రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను మించిన మోసగాడు అని వ్యాఖ్యానించారు. మొత్తం తెలంగాణను ముంచేస్తాడని అన్నాడు. కేసీఆర్ కుటుంబానికి ఓటమి రుచి చూపించింది బీజేపీనే అని అన్నారు. ‘కోరుట్లలో నేను కనబడతలేనని అంటున్నారు.. నేను కనబడటం మొదలు పెడితే ఇంకెవరూ కనిపించరు’ అంటూ తన ప్రత్యర్థులకు కౌంటర్స్ ఇచ్చారు అరవింద్. ఈ నెల 10వ తేదీన భారీ ర్యాలీతో నామినేషన్ వేస్తానని, సోమవారం నాడు మెట్‌పల్లిలో భారీ ర్యాలీ ప్రోగ్రామ్ ఉంటుందని తెలిపారాయన.

తెలంగాణలో బీజేపీదే అధికారం..

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయం అని అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకుందన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం రూ. 500 కోట్లతో ప్రత్యేక బోర్డు కాదని, బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లో బీసీ కన్వెన్షన్‌కు, 11వ తేదీన ఎస్సీ సమ్మేళనం కోసం ప్రధాని మోదీ వస్తున్నారని అన్నారు.

ALSO READ: ఈ నెల 7న అకౌంట్లోకి డబ్బు జమ

ఇదే సమయంలో టీవీ ఛానళ్లపై సంచలన కామెంట్స్ చేశారు ఎంపీ అరవింద్. టీవీ ఛానళ్లు రాజకీయ పార్టీలుగా మారిపోయానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి 40కి పైగా సీట్లు రావడం అసంభవం అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి మెజార్టీ వస్తుందని, అధికారం కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ అరవింద్. లేదంటే హంగ్ వస్తుందని అన్నారు.

హంగ్ వస్తే.. బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం అన్నారు ఎంపీ అరవింద్. మీడియా రాజకీయం చేస్తే.. తాము కూడా రాజకీయం చేస్తామని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు రాజకీయమంటుంది.. ఎన్నికల తర్వాత కూడా రాజకీయం ఉంటుందని వ్యాఖ్యానించారు.

ALSO READ: కామారెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా రేవంత్‌ రెడ్డి!

Advertisment
తాజా కథనాలు