/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-43-4.jpg)
Movie Artist Association : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్‌లో పుకార్లు, అసత్య ప్రచారాలు చేసే మరో18 యూట్యూబ్ ఛానళ్లపై వేటు వేసింది. ఈ ఛానళ్లను శాశ్వతంగా బ్లాక్ చేయించింది. ‘బ్రహ్మి ట్రోల్స్ 3.0’, ‘టీకే క్రియేషన్స్’, ‘డాక్టర్ ట్రోల్స్’, ‘ట్రోలింగ్ పోరడు’, ‘అప్‌డేట్ ట్రోల్స్’ వంటివి రద్దు చేయబడిన యూట్యూబ్ ఛానల్స్ జాబితాలో ఉన్నాయి.
కాగా ఈ ఛానళ్ళు సినిమా పరిశ్రమకు చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నాయని, నిరాధారమైన వార్తలు, వ్యక్తిగత దాడులు, అభ్యంతరకరమైన కంటెంట్‌తో ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నాయని MAA ఆరోపించింది. ఇప్పటికే MAA డిజిటల్ మీడియా కమిటీ పలు ఛానళ్లపై చర్యలు తీసుకుంటూ వస్తోంది. రీసెంట్ గానే ఐదు యూట్యూబ్ ఛానెల్స్ ను రద్దు చేయించిన 'MAA' ఇప్పుడు మరో 18 ఛానెల్స్ ను సైతం రద్దు చేయించడం విశేషం.
As part of our ongoing efforts on terminating the YouTube channels for posting derogatory content on our artists.
We have blocked an additional 18 channels that spread harmful content.
Stay tuned for further updates.#MAA #RespectOurArtists pic.twitter.com/rDnCJbDVHX
— MAA Telugu (@itsmaatelugu) July 24, 2024
Also Read : నటిని కాకపోయుంటే టీ అమ్మేదాన్ని.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
MAA నిర్ణయానికి ప్రశంసలు..
MAA నిర్ణయానికి సినీ పరిశ్రమ నుండి హర్షం వ్యక్తం అవుతోంది. పలువురు నటులు, నిర్మాతలు MAA నిర్ణయాన్ని సమర్థిస్తూ ఛానళ్లపై చర్యలు తీసుకోవడం అవసరమని అభిప్రాయపడ్డారు.
ప్రేక్షకులకు సందేశం..
MAA ప్రేక్షకులకు ఒక విషయం కూడా స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మే ముందు అవి నిజమా?కాదా? అనేది క్రాస్ చెక్ చేసుకోవాలని తెలిపింది.
Also Read: బిగ్ బాస్8 కంటెస్టెంట్స్ లిస్ట్.. జనసైనికురాలు రేఖా భోజ్ ఎంట్రీ..!