Andhra Pradesh: రష్యాలో ఎల్బ్రస్ పర్వతం అధిరోహించిన తెలుగు యువతి అన్నపూర్ణ..

పర్వతారోహకురాలు, తెలుగు యువతి అన్నపూర్ణ మరో ఘనత సాధించారు. రష్యాలోని అత్యంత ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని ఆమె అధిరోహించారు. ఈమె ఇంతకు ముందు ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించారు. ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు అమ్మాయిగా పేరుపొందారు అన్నపూర్ణ.

New Update
Andhra Pradesh: రష్యాలో ఎల్బ్రస్ పర్వతం అధిరోహించిన తెలుగు యువతి అన్నపూర్ణ..

Mountaineer Annapoorna: రష్యా,ఐరోపాలో ఎత్తైన పర్వతం..ఎల్బ్రస్. ఇది సముద్ర మట్టానికి 5,642 మీ. అంటే 18,510 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ఒక అగ్నిపర్వతం. ఇది యురేషియా సూపర్ ఖండంలో ఎత్తైన స్ట్రాటో వోల్కానో..గా పేరు గాంచింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలు కలిగి ఉన్న పర్వతాల్లో ఎల్బ్రస్ పదవ స్థానంలో ఉంది. పర్వతారోహకులు దీనిని ఎక్కడం ఒక విక్టరీగా భావిస్తారు. అలాంటి దీన్ని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన అన్నపూర్ణ సాధించారు. ఎల్బ్రస్ పర్త శిఖరం మీదకు చేరుకున్నారు. ప్రస్తుతం ఇంకా రష్యాలోనే ఉన్న అన్నపూర్ణ త్వరలోనే తాడేపల్లిలో తన నివాసానికి చేరుకోనున్నారు.

Also Read: Telangana: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Advertisment
తాజా కథనాలు