Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. దీనికి సంబంధించి ఏర్పాట్లను చేయాని ప్రభుత్వం ఆదేశించింది. దీని ప్రకారం ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. జాబితాపై సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది జాబితా ప్రచురిస్తారు. ఈ మేరకు ఓటరు జాబితా తయారీపై ఈనెల 29న కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.
పూర్తిగా చదవండి..Telangana: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 6 నుంచి 13వ తేదీ వరకు దీనిని నిర్వహించనున్నారు.
Translate this News: