/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-04T212607.696-jpg.webp)
Video viral: ఓ ధ్రువపు ఎలుగుబంటి నీటిలో మునిగిపోతున్న తన బిడ్డను కాపాడిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బండలపై నుంచి అనుకోకుండా నీటిలో పడిపోయిన చిన్నప్రాణినికి (Polar bear) ఈదడం రాదు. దీంతో వాటర్ లో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. నీటినుంచి బయటపడటానికి ప్రయత్నిస్తుంది. కానీ పైకి రాలేకపోతుంది. అయితే అక్కడే పక్కన బిడ్డను కాచుకుని చూస్తున్న తల్లి మెరుపు వేగంతో నిటీలో దూకి పిల్లను ఒడ్డుకు చేర్చింది.
Mother Polar Bear dives into pool to save her cub from drowning…and even teaches it how to climb to safety pic.twitter.com/ebpXqTvRN4
— Gabriele Corno (@Gabriele_Corno) February 12, 2024
ఇది కూడా చదవండి: AP Elections 2024: అకౌంట్స్ అన్నీ సెటిల్ చేస్తాం.. జగన్ కు చంద్రబాబు వార్నింగ్!
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా @Gabriele_Corno అనే వినియోగదారు దీనిని నెట్టింట పోస్ట్ చేయగా 13-సెకన్ల క్లిప్ క్షనాల్లో వైరల్‌గా మారింది. గంటల వ్యవధిలోనే 115,000 వీక్షణలను పొందింది. ప్రపంచవ్యాప్తంగా వీక్షకుల నుంచి భావోద్వేగాలను రేకెత్తించింది. అమ్మప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువేనంటూ నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.