Karnataka: మార్కుల విషయంలో గొడవ.. ఒకరినొకరు పొడుచుకున్న తల్లీ కూతుళ్ళు

చదువులు, మార్కులు ప్రతీ ఏడాది విద్యార్ధుల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. మార్కుల మాయలో పడి ఆత్మహత్యల చేసుకోవడం విన్నాం. కానీ తాజాగా కర్ణాటకలో తల్లీకూతురు మార్కుల విషయంలో గొడవ పడి ఒకరిని ఒకరు పొడుచుకున్నారు.

New Update
Karnataka: మార్కుల విషయంలో గొడవ.. ఒకరినొకరు పొడుచుకున్న తల్లీ కూతుళ్ళు

Mother - Daughter Fight For Marks: మార్కుల గోల అంతా ఇంతా కాదు. ఎంత వచ్చినా సరిపోవడం లేదు నేటి తల్లిదండ్రులకు, పిల్లలకు కూడా. ఒక్క మార్కు తగ్గిన్నా గోలగోల చేస్తున్నారు. వీటి గురించి ఆత్మహత్యలు చేసుకున్నారు కూడా ఉన్నారు. అలాంటి మార్కుల మాయలో పడి ఒక కుటంబం రక్తమడుగులో తేలింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది. తల్లీకుమార్తెల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణాలు తీసింది.

ఏం జరిగిందింటే...

కర్ణాటకలో మాధ్యమిక విద్య అంటే పీయూసీ, ఇంటర్‌కు సమానమైన కోర్సు ఫలితాలు ఈమధ్యనే విడుదల అయ్యాయి. ఇందులో కుమార్తెకు 40 మార్కులు తక్కువగా వచ్చాయి. దీంతో తల్లి పద్మజ మార్కులు ఎందుకు తక్కువగా వచ్చాయని అడిగింది. ఇది కాస్తా చిలికి చిలికి గాలి వానలా తయారయింది. ఇదే సమయంలో బాగా కోపంతో ఉన్న కూతురు ఇంట్లో ఉన్న కత్తి తెచ్చి తల్లిని నాలుగు సార్లు పొడించింది. అక్కడితో ఆగినా బావుండేది. కానీ తల్లి కూడా ఊరుకోకుండా కూతురి మీద ఎదురుదాడికి దిగింది. కుమార్తెను పద్మజ కూడా ఇష్టం వచ్చినట్టు పొడిచింది. దీంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. తీవ్ర కత్తి పోట్లకు గురవ్వడం వల్లనే కుమార్తె మరణించిందని బెంగళూరులోని బనశంకరి పోలీసులు చెబుతున్నారు. మరోవైపు రక్తస్రావంతో ఉన్న పద్మజను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:Covid Vaccine: కోవిషీల్డ్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా

Advertisment
తాజా కథనాలు