Delhi: దేశ రాజధానిలో మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ అరెస్ట్

మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న ఇస్లామిగ్‌ స్టేట్ టెర్రరిస్ట్‌ మహ్మద్‌ షానవాజ్‌ అలియాస్ షఫీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరో ఇద్దరు టెర్రరిస్టులను సైతం అదుపులోకి తీసుకున్నట్లు దేశ రాజధాని పోలీసులు తెలిపారు.

New Update
Delhi: దేశ రాజధానిలో మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ అరెస్ట్

మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న ఇస్లామిగ్‌ స్టేట్ టెర్రరిస్ట్‌ మహ్మద్‌ షానవాజ్‌ అలియాస్ షఫీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరో ఇద్దరు టెర్రరిస్టులను సైతం అదుపులోకి తీసుకున్నట్లు దేశ రాజధాని పోలీసులు తెలిపారు. తాము పట్టుకున్న టెర్రిరిస్ట్‌ జాతీయ దర్యాప్తు సంస్థ అయిన ఎన్‌ఐఏ లీస్ట్‌లో మోస్ట్‌ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా అతనిపై రివార్డు సైతం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతన్ని పట్టుకున్న వారికి 3 లక్షల రూపాయలు ఎన్‌ఐఏ గతంలో ప్రకటించిందన్నారు.

ఉగ్రవాది మహ్మద్‌ షానవాజ్‌ అలియాస్ షఫీ గతంలో దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పేలుళ్లకు ప్రయత్నించినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. వీటిని పోలీసులు నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం భారత దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేయాలని స్కెచ్‌ వేసినట్లు అధికారులు గుర్తించారు. ఇంజనీర్‌ అయిన షనవాజ్ పుణే ఐసిస్ మాడ్యూల్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అతన్ని ఎన్‌ఐఏ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ లీస్ట్‌లో చేర్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో పుణేలో అరెస్ట్‌ అయిన టెర్రరిస్ట్‌ షఫీ.. పోలీసుల కస్టడీ నుండి తప్పించుకున్నట్లు అధికారులు వివరించారు.

మరోవైపు పోలీస్‌లు అదుపులోకి తీసుకున్న టెర్రరిస్ట్‌ మహ్మద్‌ షానవాజ్‌ టీమ్‌ నుంచి లిక్విడ్ కెమికల్స్‌తో పాటు పలు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌తో పాటు అరెస్ట్‌ అయిన అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. ఆ లిక్విడ్‌ను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, వాటిని ఎవరు వారికి ఇచ్చారు, అనే కోణంలో సైతం విచారణ జరుగుతన్నట్లు పోలీస్‌ ఉన్నతాధికారులు వెల్లడించారు.

ALSO READ: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్‌కు సిద్దం

Advertisment
Advertisment
తాజా కథనాలు