Women’s Health : మహిళల్లో ఎక్కువగా కనిపించే వ్యాధులు.. నివారణా మార్గాలు పురుషుల కంటే మహిళల్లో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. మహిళలను ప్రభావితం చేసే అత్యంత తీవ్రమైన వ్యాధులలో రొమ్ము క్యాన్సర్, యోని ఇన్‌ఫెక్షన్, గర్భాశయ క్యాన్సర్ ఉన్నాయి. వీటికి ఎలా చెక్ పెట్టాలో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 09 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Women’s Diseases : ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత అయినప్పటికీ కుటుంబాన్ని చూసుకునేటప్పుడు మహిళలు తమ ఆరోగ్యంపై అజాగ్రత్తగా ఉండటం తరచుగా కనిపిస్తుంది. అయితే పురుషుల కంటే మహిళల ఆరోగ్యం(Women's Health) చాలా క్లిష్టంగా ఉంటుంది. మహిళలకు ఎక్కువ హాని కలిగించే అనేక వ్యాధులు ఉన్నాయి. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధపెట్టి ముందుగానే గుర్తించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు అంటున్నారు. రొమ్ము క్యాన్సర్: మహిళలను ప్రభావితం చేసే అత్యంత తీవ్రమైన వ్యాధులలో రొమ్ము క్యాన్సర్(Breast Cancer) ఒకటి. భారతదేశం(India) లో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం 25 శాతం కంటే ఎక్కువ కేసులు ఇవే నమోదవుతున్నాయి. దీనిని నివారించడానికి ముప్పై సంవత్సరాల వయస్సు తర్వాత మహిళలు కనీసం సంవత్సరానికి రెండుసార్లు మామోగ్రఫీ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు అంటున్నారు. రక్తహీనత: రక్తహీనత అనేది ఒక సాధారణ వ్యాధి అయినప్పటికీ ఇది పురుషుల కంటే మహిళలకు ఎక్కువగా వస్తుంటుంది. శరీరంలో హిమోగ్లోబిన్(Hemoglobin) లోపం, రక్తం లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. కుటుంబం, బిజీ షెడ్యూల్‌లో మహిళలు సరైన ఆహారం తీసుకోకపోవడంతో తరచుగా రక్తహీనతకు గురవుతారు. దీనిని నివారించడానికి శరీరంలో హిమోగ్లోబిన్ స్థితిని తెలుసుకోవడానికి ప్రతి సంవత్సరం బ్లడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలి. యోని ఇన్‌ఫెక్షన్: మహిళలు తరచుగా యోనిలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుంటారు. దురద, మంటగా అనిపిస్తుంటుంది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, పరిశుభ్రత లేకపోవడంతో పాటు లైంగికంగా సంక్రమించే వ్యాధుల వల్ల కూడా ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. గర్భాశయ క్యాన్సర్: గర్భాశయ క్యాన్సర్(Cervical Cancer) కూడా మహిళల్లో అత్యంత సాధారణ వ్యాధులలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు గురైన ఐదుగురిలో ఒకరు భారతదేశానికి చెందినవారని లెసెంట్ అధ్యయనం చెబుతోంది. ఈ క్యాన్సర్‌ను నివారించడానికి పెల్విక్ పరీక్షలు చేయడం చాలా ముఖ్యం. ఇది కూడా చదవండి : మీ పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా?..ఇలా మానిపించండి గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-care #health-problems #best-health-tips #womens-health మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి