Morning Wakeup : ఆరోగ్యకరమైన దినచర్య(A Healthy Routine) అన్నిటికంటే ముఖ్యం. ఇది అనేక రకాల వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఉదయం అలవాట్ల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. దాని ప్రత్యక్ష ప్రభావం మీ ఆరోగ్యంతో పాటు మీ వర్క్ ప్రొడక్టవిటీపై కనిపిస్తుంది. ఉదయం అలవాట్లు బాగుంటే రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు(Health Professionals) అంటున్నారు. మనస్సును పాజిటివ్‌గా, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కొన్ని ఉదయం అలవాట్లు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. జీవితంలో ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వడం చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పొద్దున్నే లేవడం దగ్గర్నుంచి నైట్ నిద్రపపోయే వరకు ఏం చేస్తున్నాం, ఏం తింటున్నామన్నది ముఖ్యం. ఇక కొన్ని అలవాట్లను మానేయాలని నిర్ణయించుకోండి.
ఉదయం చేయకూడని పనులు:
- మనలో చాలా మందికి కష్టమైన పని ఉదయం నిద్రలేవడం(Morning Wakeup). మీరు తరచుగా మార్నింగ్ అలారం(Morning Clock) ను పదేపదే దాటవేస్తున్నారా? కొంచెం ఎక్కువ నిద్రపోవడానికి స్నూజ్ బటన్ నొక్కుతున్నారా? ఒకవేళ ఇది నిజమైతే ఈ అలవాటను మానుకోండి. ఉదయాన్నే నిద్రలేవడం శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. అలారం మోగగనే నిద్రలెగడం అలవాటు చేసుకోండి.
- చాలామంది మార్నింగ్ కాఫీ అని.. లేకపోతే న్యూస్‌పేపర్ చదువుతూ టీ అని తాగుతుంటారు. అసలు ఇది మంచి అలవాటు కానే కాదు. టీ, కాఫీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. టీ, కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది మీకు తక్కువ సమయంలో శక్తిని అందిస్తుంది. అయితే మీరు ఉదయం ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకుంటే అనేక రకాల దుష్ప్రభావాలు వచ్చే ప్రమాదం ఉంది.అంతే కాదు అదే పనిగా కెఫిన్ తీసుకుంటే, ఇది నిద్ర సమస్యలు, ఆందోళన లాంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక కెఫిన్ తీసుకోవడం గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
- అల్పాహారం(Breakfast) దాటవేయడం బరువు తగ్గడానికి సహాయపడుతుందని చాలా మంది నమ్ముతారు. ఇది ఏ మాత్రం నిజం కాదు. టీఫిన్ తినడం చాలా ముఖ్యం. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. రాత్రి 6-8 గంటల పాటు ఖాళీ కడుపుతో ఉండి ఉంటారు. అలాంటి సమయంలో బాడీకి బ్రేక్‌ఫాస్ట్ అత్య అవసరం. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పోషకమైన అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యమైన అలవాట్లలో ఒకటి.
ఇది కూడా చదవండి: కళ్లకు కూడా థైరాయిడ్ వస్తుందా?.. లక్షణాలు ఎలా ఉంటాయి?
గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.