Health News Telugu : ఉదయం నుంచి సాయంత్రం(Morning - Evening) వరకు తెలిసో తెలియకో మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఎన్నో పనులు చేస్తుంటాం. ముఖ్యంగా ఉదయాన్నే మనలో చాలా మంది చాలా తప్పులు చేస్తుంటారు. మంచి అలవాట్ల(Good Habits) తో రోజును ప్రారంభించడం చాలా ముఖ్యం. ఇది పాజిటివ్ ఎనర్జీని కమ్యూనికేట్ చేయడంలో, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ మనం నిజంగా ఉదయాన్నే ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరిస్తున్నామా?
నోటి శుభ్రత చాలా అవసరం:
ఉదయం అల్పాహారం(Breakfast) తీసుకున్న తర్వాత బ్రష్ చేయడం అసలు కరెక్ట్ కాదు. ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాత్రిపూట నోటిలో అనేక రకాల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అందుకే ఉదయం బ్రష్ చేయకుండా ఏదైనా తినడం వల్ల ఈ బ్యాక్టీరియా కడుపులోకి వెళుతుంది. ఇది అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. నోటి పరిశుభ్రత పరంగా కూడా ఈ అలవాటు హానికరం. ఉదయాన్నే మీరు చేయాల్సిన మొదటి పని మీ దంతాలు, నోటిని శుభ్రం చేసుకోవడం.
మలబద్దక సమస్యకు చెక్:
రాత్రి 8-10 గంటల తరువాత శరీరంలో సహజంగా నీటి కొరత ఉంటుంది. అందుకే ఉదయాన్నే నీరు తాగటం(Drinking Water) చాలా అవసరం. ఉదయాన్నే నీరు తాగకపోతే అది మీ జీవక్రియను మందగించేలా చేస్తుంది. అలాగే శరీరం ఎక్కువసేపు డీహైడ్రేట్ కావడం వల్ల అనేక సమస్యలు రావొచ్చు. ప్రతి ఒక్కరూ ఉదయం బ్రష్ చేసిన తర్వాత పుష్కలంగా నీరు తాగాలి. తేలికపాటి గోరువెచ్చని నీరు తాగడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయాన్నే నీరు తాగటం మలబద్దక సమస్యకు చెక్ పెడుతుంది. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను (యూటీఐ) నివారించడంలో సహాయపడుతుంది. ఇక ఆరోగ్యానికి వ్యాయామం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఉదయాన్నే యోగా, ధ్యానం సాధన చేయడం మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుంది.
Also Read : ప్రతిరోజూ ఎన్ని అడుగులు వేయాలి? దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టండిలా!