MPox: మానవజాతిని మటాష్‌ చేసేందుకు కంకణం కట్టిన మంకీపాక్స్‌!

మాయదారి మంకీపాక్స్‌ మానవజాతిని మటాష్‌ చేసేందుకు కంకణం కట్టేసుకుని రెడీ అయిపోయింది. ముఖ్యంగా ఓ కొత్త స్ట్రెయిన్‌ ప్రజలను భయపెడుతోంది. దాని పేరే క్లాడ్‌-1b. నిన్నమొన్నటివరకు ఆఫ్రికాలో కేసుల పెరుగుదలకు కారణమైన ఈ స్ట్రెయిన్‌ ఇప్పుడు ఆసియాకి పాకింది.

New Update
Monkey Pox : డేంజర్ బెల్స్.. పాకిస్తాన్ లో ఐదో మంకీ పాక్స్ రోగి

MPox: మాయదారి మంకీపాక్స్‌ మానవజాతిని మటాష్‌ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆఫ్రికాలో ఫ్లైటెక్కి యూరప్‌, ఆసియా అమెరికాలో ఈ వ్యాధి ల్యాండ్ అయిపోయింది.ఇప్పటికే ఆఫ్రికాలో వేలాది మందికి సోకిన మంకీపాక్స్‌ క్రమక్రమంగా వివిధ దేశాలకు వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఓ కొత్త స్ట్రెయిన్‌ ప్రజలను భయపెడుతోంది. దాని పేరే క్లాడ్‌-1b. నిన్నమొన్నటివరకు ఆఫ్రికాలో కేసుల పెరుగుదలకు కారణమైన ఈ స్ట్రెయిన్‌ ఇప్పుడు ఆసియాకి పాకింది. తమ దేశంలో క్లాడ్-1b స్ట్రెయిన్ కేసు రిజిస్టర్‌ అయ్యినట్టు థాయ్‌లాండ్ నిర్ధారించింది.

అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్-CDC ప్రకారం మంకీపాక్స్‌కు రెండు ప్రధాన జాతులు ఉన్నాయి. అందులో ఒకటి క్లాడ్-1, ఇంకోటి క్లాడ్-2. ఇందులో క్లాడ్-2 జాతి పశ్చిమ ఆఫ్రికాకు చెందినది. 2022లో మంకీపాక్స్ వ్యాప్తికి ఈ స్ట్రెయిన్ ఆజ్యం పోసింది. అయితే క్లాడ్-2 ప్రాణాంతకం కాదు. CDC ప్రకారం ఈ స్ట్రెయిన్ బారిన పడిన 99.9శాతం మంది బతికి ఉన్నారు.

అటు ఇటీవలీ ప్రపంచదేశాలను భయపెడుతున్న క్లాడ్‌-1 జాతి మాత్రం డేంజరస్‌. ఇది సోకిన వారిలో 10శాతం మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. మంకీపాక్స్‌ అనేది జూనోటిక్ వ్యాధి. అంటే ఇది మనుషుల నుంచి జంతువులకు వ్యాపిస్తుంది. ఏదో ఒక స్ట్రెయిన్‌ సోకిన వ్యక్తి లేదా జంతువుతో సన్నిహిత సంబంధం ఉంటే ఇది వ్యాపిస్తుంది. నిజానికి రెండు జాతులు ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో దద్దుర్లు భారీ సైజులో ప్రత్యక్షమవుతాయి.

Also Read: నెక్ట్స్‌ కూలేది ఆ హీరో కట్టడమే.. సినీ ఇండస్ట్రీకి హైడ్రా టెన్షన్!

Advertisment
తాజా కథనాలు