Sukesh Letter : తీహార్‌కు స్వాగతం.. కవితకు సుఖేష్ చంద్ర లేఖ.

మనీలాండరింగ్‌ కేసులో నిందితుడు అయిన సుఖేష్ చంద్రశేఖర్...బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రాసిన లేఖ సంచలనంగా మారింది. తీహార్ జైల్లో త్వరలో మీరు కూడా సభ్యులు కాబోతున్నారు...మీతో పాటూ అరవింద్ కేజ్రీవాల్ కూడా వస్తారు అంటూ సుఖేష్ లేఖలో రాశారు.

Sukesh Letter : తీహార్‌కు స్వాగతం.. కవితకు సుఖేష్ చంద్ర లేఖ.
New Update

Money Laundering Accused Chandrasekhar Letter To Kavitha : ఈరోజు ఉదయం బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కు మనీలాండరింగ్(Money Laundering) నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) లేఖ రాసారు. ఇప్పుడు అది సంచలనంగా మారింది. ఇందులో కవితను ఉద్దేశిస్తూ.. తీహార్‌ జైలు కౌంట్‌డౌన్‌ మీకు ప్రారంభమైంది. త్వరలో మీరు తీహార్‌ జైలు క్లబ్‌(Tihar Jail Club) లో సభ్యులు కాబోతున్నారు. మీతో పాటూ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా త్వరలోనే అరెస్ట​్‌ అవుతారు. సింగపూర్‌, హాంకాంగ్‌, జర్మనీలో దాచుకున్న మీ అక్రమ సంపాదన అంతా బయటపడనుంది. అన్నింటి మీదా దర్యాప్తు జరుగుతోంది. వాట్సాప్‌ చాటింగ్‌, కాల్స్‌ అన్నీ బయటకు వస్తాయి అంటూ సుఖేష్ లేఖలో రాశారు. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను కాపాడేందుకు ప్రయత్నం చేయవద్దు అంటూ కవిత సలహా ఇచ్చాడు సుఖేష్. కేసు విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దని...అన్ని వివరాలతో సహా కావాల్సిన సాక్ష్యాలు కూడా కోర్టుకు తెలుసని చెప్పాడు. మీరందరూ తీహార్ జైలుకు రావడం గ్యారంటీ...మీకు స్వాగతం పలకడానికి నేను రెడీ గా ఉంటా అంటూ సుఖేష్ లేఖలో పేర్కొన్నాడు.

publive-image

100 కోట్ల ముడుపులు నిజమే..

మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) అరెస్ట్ పై ఈడీ (ED) అధికారంగా ప్రకటన విడుదల చేసింది. ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపుల చెల్లింపులో కవిత కీలక పాత్ర పోషించారని తెలిపింది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు 245 ప్రాంతాల్లో సోదాలు చేశామని వెల్లడించింది. 5 సప్లిమెంటరీ ఛార్జిషీట్లు దాఖలు చేసినట్లు ఈడీ ప్రకటించింది. 128 కోట్ల ఆస్తులను గుర్తించి జప్తు చేశామని తెలిపింది. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ తో కవితకు సత్సంబంధాలు ఉన్నాయని ఈడీ ప్రకటించింది.

ఈ కేసులో మనిష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ తో పాటు 15 మందిని అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపింది. కోర్టు అనుమతితోనే కవితను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపింది ఈడీ. కవితను అరెస్ట్ చేసే సమయంలో ఆమె బంధువులు ఆటకం కలిగించారని వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి కవిత భర్త అనిల్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన రోజు కవితతో ములాఖత్ కు హాజరుకాలేదు.

Also Read:Maoist Encounter: చత్తీస్‌గడ్‌, మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌

#kavitha #brs-mlc #thihar-jail #sukhesh-chandra-sekhar #money-landering
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe