Maoist Encounter : చత్తీస్గడ్-మహారాష్ట్ర(Chhattisgarh-Maharashtra) సరిహద్దుల్లో మావోయిస్టు(Maoist) ల మీద పోలీసులు(Police) మరోసారి విరుచుకుపడ్డారు. ఈరోజు తెల్లవారుఘామున బారీ ఎన్కౌంటర్(Encounter) నిర్వహించారు. ఇందులో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు చనిపోయారని కీలక సమాచారం అందుతోంది. మిగిలిన వారిని కూడా పట్టుకునేందుకు పోలీసులు ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. గడ్చిరోలిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డప్పుడు కాల్పులు జరిగాయి. చనిపోయిన వారంతా మావోయిస్టు అగ్రనేతలని.. తెలంగాణ(Telangana) రాష్ట్ర కమిటీ సభ్యులని అధికారులు ధృవీకరించారు. మంచిర్యాల డివిజన్ కమిటీ సెక్రటరీ వర్గీస్, చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ మగ్తూ, కుర్సంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్ చనిపోయిన వారిలో ఉన్నారు. ఇక చనిపోయిన మావోయిస్టుల మీద 36 లక్సల రివార్డులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Maoist Encounter : చత్తీస్గడ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్
ఛత్తీస్గడ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో మావోయిస్టు కీలకనేతలు నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. మిగిలిన మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
Translate this News: