Money Laundering Accused Chandrasekhar Letter To Kavitha : ఈరోజు ఉదయం బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కు మనీలాండరింగ్(Money Laundering) నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) లేఖ రాసారు. ఇప్పుడు అది సంచలనంగా మారింది. ఇందులో కవితను ఉద్దేశిస్తూ.. తీహార్ జైలు కౌంట్‌డౌన్ మీకు ప్రారంభమైంది. త్వరలో మీరు తీహార్ జైలు క్లబ్(Tihar Jail Club) లో సభ్యులు కాబోతున్నారు. మీతో పాటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా త్వరలోనే అరెస్ట్ అవుతారు. సింగపూర్, హాంకాంగ్, జర్మనీలో దాచుకున్న మీ అక్రమ సంపాదన అంతా బయటపడనుంది. అన్నింటి మీదా దర్యాప్తు జరుగుతోంది. వాట్సాప్ చాటింగ్, కాల్స్ అన్నీ బయటకు వస్తాయి అంటూ సుఖేష్ లేఖలో రాశారు. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను కాపాడేందుకు ప్రయత్నం చేయవద్దు అంటూ కవిత సలహా ఇచ్చాడు సుఖేష్. కేసు విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేయవద్దని…అన్ని వివరాలతో సహా కావాల్సిన సాక్ష్యాలు కూడా కోర్టుకు తెలుసని చెప్పాడు. మీరందరూ తీహార్ జైలుకు రావడం గ్యారంటీ…మీకు స్వాగతం పలకడానికి నేను రెడీ గా ఉంటా అంటూ సుఖేష్ లేఖలో పేర్కొన్నాడు.
పూర్తిగా చదవండి..Sukesh Letter : తీహార్‌కు స్వాగతం.. కవితకు సుఖేష్ చంద్ర లేఖ.
మనీలాండరింగ్ కేసులో నిందితుడు అయిన సుఖేష్ చంద్రశేఖర్...బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రాసిన లేఖ సంచలనంగా మారింది. తీహార్ జైల్లో త్వరలో మీరు కూడా సభ్యులు కాబోతున్నారు...మీతో పాటూ అరవింద్ కేజ్రీవాల్ కూడా వస్తారు అంటూ సుఖేష్ లేఖలో రాశారు.
Translate this News: