UP: భాతర ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల వేళ ఓటర్లను నమ్మించేందుకు తప్పుడు హామీలు ఇస్తున్నాయన్నారు. గెలుపుకోసం నాయకులు అడ్డగొలుగా అబద్ధాలు చెప్పి ఆ తర్వాత కనిపించకుండా పోతారంటూ విమర్శలు చేశారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
ఈ మేరకు యూపీలో రూ. 34,700 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయగా.. వీటిలో 16 విమానాశ్రయాలు, బహుళ అభివృద్ధి ప్రాజెక్టులున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్, భాజపా నేతలతో కలిసి అజంగఢ్‌లోని మండూరిలో మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. తాను అందరిలాంటి నాయకుడిని కాదని, మాట ఇస్తే తప్పకుండా నెరవేరుస్తానన్నారు.
ఇది కూడా చదవండి: Priyanka Chopra: నీతా అంబానీపై ప్రియాంక ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ ఒక్కటి చాలు అంటూ!
అలాగే ‘35 ఏళ్ల కిందట ఇచ్చిన వాగ్దానాలను ఇప్పటికీ నెరవేర్చలేకపోయారు. గత ప్రభుత్వాల్లో కొంతమంది నాయకులు ప్రజలను మోసం చేసేందుకు హామీలు ఇచ్చేవారు. రిజల్ట్స్ వెలువడిన తర్వాత వారితో పాటు హామీలు కూడా కనుమరుగయ్యాయి. వాళ్ల లిస్టులో నన్ను కూడా చేర్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, నేను అలాంటి నాయకుడిని కాదు. మోడీ ఎప్పుడూ భిన్నమైన వ్యక్తిగానే ఉంటాడు’ అంటూ చెప్పుకొచ్చారు.