PM Kisan Yojana: రైతులకు మోదీ సర్కార్ షాక్.. పీఎం కిసాన్ పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

ప్రధానమంత్రి కిసాన్ యోజనపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పీఎం కిసాన్ స్కీం కింద అందిస్తున్న నిధులను పెంచే ప్రసక్తే లేదని కేంద్రం వెల్లడించింది. డబ్బు పెరుగుతాయని అంచనా వేసిన రైతులకు కేంద్రం మొండిచేయి చూపించింది.

PM Kisan Yojana: రైతులకు మోదీ సర్కార్ షాక్.. పీఎం కిసాన్ పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన!
New Update

పీఎం కిసాన్ యోజనపై కేంద్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. పీఎం కిసాన్ నిధుల అంశంపై ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం. మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ స్కీం...ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ ద్వారా రైతుల అకౌంట్లోకి నేరుగానే డబ్బులు వచ్చి చేరుతున్నాయి. దీనివల్ల చాలా మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.

ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం కింద ఏటా రూ. 6వేలు లభిస్తున్నాయి. ఈ డబ్బు ఒకేసారి అకౌంట్లో జమ కాకుకండా విడతలవారీగా జమ అవుతున్నాయి. మూడు విడతల్లో రూ. 2వేల చొప్పున డబ్బులు లభిస్తున్నాయి. ఇలా ప్రతి సంవత్సరం డబ్బుల రైతుల అకౌంట్లో నేరుగా డిపాజిట్ అవుతూ వస్తున్నాయి.

అయితే ఈ మధ్య కాలంలో పీఎం కిసాన్ స్కీం డబ్బులను పెంచుతుందని అంతా అంచనా వేసారు. కానీ ఎన్నికల ఏడాది కావడంతో ఈ అంచనాలు బలంగానే వినిపించినప్పటికీ మోదీ సర్కార్ ఈ సీఎంపై డబ్బుులు పెంచేందుకు ఆసక్తి చూపలేదు. పీఎం కిసాన్ స్కీం కింద అందిస్తున్న డబ్బులను పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీనివల్ల డబ్బులు పెరగవచ్చని అంచనా వేసిన రైతులకు మొండిచేయి చూపించిందని చెప్పుకోవచ్చు. అంటే పీఎం కిసాన్ డబ్బులు ఇక ఇప్పట్లో పెరిగే అవకావం లేనట్లే.

కాగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ కింద ప్రతిఏటా అర్హత కలిగిన రైతులకు రూ. 6వేల చొప్పున లభిస్తున్నాయి. ఈ డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతున్నాయి. ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఈ డబ్బులు రైతుల అకౌంట్లో జమ అవుతున్నాయి. అంటే రూ. 2వేల చొప్పున వస్తున్నాయి. 4 నెలలకు ఒకసారి రూ. 2వేలు రైతుల బ్యాంకు అకౌంట్లోకి జమ అవుతున్నాయి. ఇప్పటికే 15 విడతల డబ్బులు వచ్చాయి. అంటే ఒక్కో రైతుకు మోదీ ప్రభుత్వం ఏకంగా రూ. 30 వేలు అందించింది. ఇక రానున్న కాలంలో 16వ విడత పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు కూడా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.

ఇది కూడా చదవండి: చరిత్ర సృష్టించడమే టార్గెట్.. దక్షిణాఫ్రికా టూర్ కు విమానమెక్కిన టీమిండియా.. 

#pm-modi #pm-kisan-yojana #pm-kisan-yojana-nidhi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe