PM Modi: మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు.. వారిదే కపట ప్రేమ: మోడీ కీలక వ్యాఖ్యలు!

ముస్లింలకు బీజేపీ, మోడీ వ్యతిరేకమనే ప్రచారంపై ప్రధాని మోడీ స్పందించారు. ‘ముస్లింలను వ్యతిరేకించడం మా విధానం కాదు. మమ్మల్ని వ్యతిరేకులుగా చూపించి కొందరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారు. మేము ఇస్లాం, ముస్లింలను వ్యతిరేకించట్లేదు’ అని అన్నారు.

New Update
PM Modi: అందుకు కట్టుబడి ఉన్నాం.. తెలంగాణ ప్రజలకు మోదీ విషెస్

Modi: లోక్ సభ ఎన్నికల వేళ ప్రధాని మోడీ ముస్లింలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొన్నిచోట్ల ఇప్పటికే పోలింగ్ జరుగుతుండగా.. త్వరలో పోలింగ్ జరగబోయే మరికొన్ని ప్రాంతాల్లో మోడీ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మూడోసారి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ, ప్రజలను కలుస్తూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన ప్రధాని.. తాను ఇస్లాంను, ముస్లింలను వ్యతిరేకించనని, అలా ఎప్పుడూ చేయలేదన్నారు.

ఇది కూడా చదవండి: Karan Johar: ఆ హాస్య నటుడు నాపట్ల చీప్ గా వ్యవహరించాడు.. కరణ్ జోహార్ ఎమోషనల్ పోస్ట్!

అది మా విధానం కాదు..
ఈ మేరకు మోడీ మాట్లాడుతూ.. ‘నిజానికి ముస్లింలను వ్యతిరేకించడం మా విధానం కాదు. నెహ్రూ కాలం నుంచే విపక్షాలు మాగురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ముస్లిం వ్యతిరేకులు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. దీనిని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. మమ్మల్ని వ్యతిరేకులుగా చూపించి.. తాము వారికి స్నేహితులమంటూ కపట ప్రేమను ప్రదర్శిస్తుంటారు. కానీ ముస్లిం సమాజం ఇప్పుడు చైతన్యవంతంగా మారింది. ట్రిపుల్ తలాక్‌ రద్దు చేసినప్పుడు వారి ఆందోళనపై నేను నిజాయతీగా ఉన్నానని ముస్లిం సోదరీమణులు భావించారు. ఆయుష్మాన్ కార్డులు ఇచ్చినప్పుడు, కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చినప్పుడు అలాగే అనుకున్నారు. నేను వ్యక్తిగతంగా ఎవరిపైనా వివక్ష చూపట్లేదని అర్థం చేసుకున్నారు. వారి అబద్ధాలు బయటపడ్డాయనే బాధపడుతున్నారు. అందుకే తప్పుదోవ పట్టించేందుకు రకరకాల అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు’ అంటూ కాంగ్రెస్ పై పరోక్షంగా విమర్శలు చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు