Modi Sensational Announcement : దేశంలో సార్వత్రిక ఎన్నికల (General Elections) వేళ ప్రధాని మోడీ మరో కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా అవినీతి కేసుల్లో భాగంగా ఈడీ (ED) స్వాధీనం చేసుకున్న సొమ్మును తిరిగి పేదలకు పంచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోడీ (PM Modi).. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ విపక్షాల ఆరోపణలను ఖండించారు. కాంగ్రెస్(Congress) హయాంలోనే ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే సమర్థంగా పనిచేయడం ప్రారంభించిందని చెప్పారు.
వారంతా పేదల సొమ్మును దోచుకున్నారు..
ఈ మేరకు ప్రధాని మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో అధికార బలంతో కొందరు వ్యక్తులు పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారు. ఆ డబ్బంతా తిరికి వారికే చెందాలని కోరుకుంటున్నా. ఇందుకోసం న్యాయబృందం సలహా తీసుకుంటాం. చట్టపరంగా మార్పులు చేసేందుకు వెనుకాడబోం. దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్న డబ్బును ఏం చేయాలో సలహా ఇవ్వాలని ఇప్పటికే న్యాయవ్యవస్థను కోరాను అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అలాగే ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మేము గెలుస్తామా? లేదా అనేది నేను ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ 400 సీట్లు గెలుస్తామని ప్రజలే మాలో విశ్వాసం నింపారు. 2019 ఎన్నికల నుంచే మా కూటమికి 400 స్థానాల మెజార్టీ ఉంది. ఈసారి ఎలాగైనా 400 మార్క్ దాటాలని మా నేతలకు సూచించామన్నారు.
Also Read : సీఎం జగన్‌కు బెదిరింపు!.. డాక్టర్ లోకేష్ అరెస్ట్