CPI Narayana: జీ20 సదస్సును మోడీ రాజకీయంగా వాడుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీ20 సదస్సును ప్రధాని రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. మణిపూర్ అల్లర్లకు కారణం బీజేపీనే అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అల్లర్లను ఎందుకు నియంత్రించలేక పోతున్నారని నారాయణ ప్రశ్నించారు. By Karthik 20 Aug 2023 in రాజకీయాలు హైదరాబాద్ New Update షేర్ చేయండి వచ్చే నెలలో జరిగే జీ20 సదస్సు కోసం ఇప్పటి నుంచే నాకాబందీ నిర్వహిచడం ఏంటని కేంద్రంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో పోలీసులు ఆంక్షలు విధిస్తూ.. వాహనాలను తనిఖీలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అంతే కాకుండా కొన్ని కార్యాలయాలను సైతం మూసివేయించారని ఆయన మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ జీ20 దేశాలకు అధ్యక్ష బాధ్యత వహిస్తున్నారని అత్యుత్సాహంతో వ్యవహరిస్తోన్నారని విమర్శించారు. మోడీ జీ20 లోగోగా పువ్వు గుర్తు పెట్టి సదస్సును రాజకీయంగా వాడుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సదస్సులను సైతం రాజకీయంగా వాడుకుంటున్న మోడీకి ఇది రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. కొన్ని నెలలుగా మణిపూర్ మండుతున్నా ఆ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని నారాయణ ప్రశ్నించారు. బీజేపీ గుజరాత్‌ను మించి మణిపూర్‌లో కుట్రలు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతంగా ఉన్న మణిపూర్‌ను రెచ్చగొట్టింది బీజేపీనే అని ఆయన మండిపడ్డారు. అక్కడ జరుగుతున్న అల్లర్లకు, అరాచకాలకు బీజేపీనే కారణమన్నారు. కేంద్ర ప్రభుత్వం హైకోర్టు ద్వారా అక్కడి ప్రభుత్వానికి డైరెక్షన్ ఇప్పించిందని ఆరోపించారు. ట్రైబల్ రక్షణకు ఎప్పటి నుంచో చట్టం ఉందన్న ఆయన.. రాజ్యాంగం నుంచి ఆ చట్టాన్ని తొలగించాలని బీజేపీ చూస్తోందన్నారు. ఆ ప్రయత్నానికి నిదర్శనమే ఈ దాడులు అని నారాయణ మండిపడ్డారు. అక్కడ పోలీసుల ఎదురుగానే మారణ హోమం జరుగుతున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్నారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన నిందితులను అదుపులోకి తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. తల్లి, కూతుళ్లపై అత్యాచారం చేసి చంపేశారన్న ఆయన.. నిందితులను పోలీసులు అరెస్ట్ చేయాలేకపోయారన్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతాయన్న సమయంలో దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చిందన్నారు. అంతకు ముందు అమిత్ షా మణిపూర్‌లో పర్యటించారన్న ఆయన.. అప్పుడు ఈ వీడియోను ఎందుకు బయటకు తీసుకురాలేదని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో మణిపూర్ అంశంపై విపక్షాలు పట్టుబడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా.. తమ బిల్లులను పాస్ చేయించుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. #cpi #central-government #g20-summit #narayana #riots #narendra-modi-manipur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి