ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి భారత ప్రధాని మోడీ, బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ కొత్త మంత్రులను ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్క గారికి, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను అని హరీష్ రావు అన్నారు.
అలాగే తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నానన్నారు ప్రధాని మోడీ