Rahul Gandhi: పేదలు అడుగు పెట్టలేని రైళ్లు ఎవరికోసం.. మోడీ ప్రభుత్వానికి రాహుల్ చురకలు!

సంపన్నుల కోసమే మోడీ ప్రభుత్వం రైల్వే విధివిధానాలను తయారు చేస్తుందని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. పేదలు అడుగు పెట్టలేని ఉన్నత వర్గం రైలును చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. దోపిడీలు బయటపడుకుండా రైల్వే ప్రత్యేక బడ్జెట్‌కు ముగింపు పలికారని ఆరోపించారు.

New Update
Rahul Gandhi: పేదలు అడుగు పెట్టలేని రైళ్లు ఎవరికోసం.. మోడీ ప్రభుత్వానికి రాహుల్ చురకలు!

Rahul Gandhi: దేశంలో పేదలకు మేలు చేయకుండా సంపన్నుల కోసమే మోడీ ప్రభుత్వం రైల్వే విధివిధానాలను తయారు చేస్తుందని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) మండిపడ్డారు. ముఖ్యంగా భారతీయ రైల్వేలో (Indian Railways) విధానాలన్నీ డబ్బున్న వారికి సౌకర్యాలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోందని ఆరోపించారు. అంతేకాదు వివిధ ఛార్జీల పేరుతో టికెట్ల రేట్లు పెంచి, ఏసీ బోగీలను పెంచుతూ సాధారణ ప్రయాణికులకు రైల్వేలను దూరం చేస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు.

ఛార్జీల పేరుతో దోచుకుంటున్నారు..
ఈ మేరకు ఎక్స్‌ వేదికగా భారతీయ రైల్వే విధానాలను వ్యతిరేకిస్తూ పోస్ట్ పెట్టారు రాహుల్‌ గాంధీ. ‘డైనమిక్‌ ఛార్జీల పేరుతో దోచుకుంటున్నారు. పెరుగుతోన్న క్యాన్సలేషన్‌ ఫీజుతోపాటు ప్లాట్‌ఫామ్‌ టికెట్ల ధరల పెంచుతున్నారు. రకరకాల పేర్లతో టికెట్ల రేటు 10శాతం రెట్టింపు చేస్తున్నారు. పేదలు అడుగు పెట్టలేని ఉన్నత వర్గం రైలును చూపించి ప్రజలను మభ్యపెడుతున్నారు. వయోవృద్ధులకు ఇచ్చే మినహాయింపులను వెనక్కి తీసుకోవడం ద్వారా గడిచిన మూడేళ్లలో ప్రభుత్వం రూ.3700 కోట్ల ఆదాయం మిగిల్చుకుంది. కార్మికులు, రైతులే కాకుండా విద్యార్థులు ప్రయాణించే జనరల్‌ బోగీలను తగ్గిస్తూ ఏసీ కోచ్‌లను పెంచుతున్నారు. పేదలు, మధ్యతరగతి ప్రయాణికులకు రైల్వేల్లో ప్రాధాన్యత లేకుండా పోయింది’ అంటూ రాహుల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి : Pakistan PM: పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్!

అలాగే రైల్వేపై ఆధారపడే కోట్ల మంది ప్రజలను మోసగిస్తున్నారన్న ఆయన.. ఈ దోపిడీలన్నీ బయటపడుకుండా రైల్వే ప్రత్యేక బడ్జెట్‌కు ముగింపు పలికారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisment
తాజా కథనాలు