/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Agnipath-Scheme.jpg)
Agnipath Scheme : అగ్నిపథ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ (Agnipath) పథకాన్ని సమీక్షించడానికి, అగ్నివీర్ (Agniveer) లకు మరింత లాభం చేకూర్చే అంశాలపై చర్చించేందుకు పది మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కాగా అగ్నిపథ్ పథకంపై మిత్రపక్షాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గింది.
ఈ కమిటీ అగ్నిపథ్ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి అవసరమైన సిఫారసులు ప్రభుత్వానికి చేయనుంది. మోదీ (PM Modi) ఇటలీలో జరిగే జీ7 సదస్సు నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ నెల 17, 18వ తేదీల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. అలాగే భారత సైన్యం కూడా ఈ పథకంపై ఒక అంతర్గత నివేదికను కేంద్రానికి సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిఫారసులతోపాటు మిత్రపక్షాల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రధాని కార్యాలయం తుది నిర్ణయం తీసుకుంటుంది. అగ్నిపథ్ పథకం సమీక్ష అంశం కూడా మోదీ ప్రభుత్వ మొదటి 100 రోజుల ఎజెండాలో పెట్టుకుంది.
Also Read : మనదేశంలో దాదాపు సగం మంది ఆర్థిక మోసాలకు గురవుతున్నారు..ఆర్బీఐ