Modi : మహిళా దినోత్సవం రోజున మహిళలకు గుడ్‌ న్యూస్‌.. సిలిండర్‌ పై రూ. 100 తగ్గింపు!

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ. 100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.వంట గ్యాస్‌ ధరను తగ్గించడం వల్ల మేము కుటుంబాల శ్రేయస్సుకు మద్దతునివ్వడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కూడా అందిస్తున్నామన్నారు.

Vidya Lakshmi: విద్యార్థులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..భారీగా ఆర్థిక సాయం.. అప్లయ్ చేసుకోండిలా.!
New Update

International Women's Day : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(International Women's Day) పురస్కరించుకుని ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ. 100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్‌ లో ఇలా రాశారు. "ఈ రోజు, మహిళా దినోత్సవం సందర్భంగా, LPG సిలిండర్ ధరలను రూ. 100 తగ్గించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది."

"ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది, ప్రత్యేకించి మా నారీ శక్తి(Naari Shakti) కి ప్రయోజనం చేకూరుస్తుంది," అని ప్రధాన మంత్రి ట్వీట్(PM Tweet) చేశారు. "వంట గ్యాస్‌ ధరను తగ్గించడం వల్ల మేము కుటుంబాల శ్రేయస్సుకు మద్దతునివ్వడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కూడా అందిస్తున్నాం. ఇది మహిళలకు సాధికారత కల్పించేందుకు, వారికి 'ఈజ్ ఆఫ్ లివింగ్'(Is Of Living) కు భరోసా ఇవ్వడానికి, మా నిబద్ధతకు అనుగుణంగా ఉంది," అని ట్విటర్‌ లో పేర్కొన్నారు.

Also Read : మహిళలు, పిల్లలు సహా 200 మంది కిడ్నాప్‌!

#lpg-cylinder #twitter #pm-modi #lpg-price
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe