Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్పీచ్... ప్రధాని మోడీ గరం

పవన్ కళ్యాణ్ స్పీచ్‌ను మధ్యలో అడ్డుకున్నారు ప్రధాని మోడీ. సభకు వచ్చిన కొందరు కార్యకర్తలు కరెంటు పోల్స్ ఎక్కడంతో.. అది గమనించిన మోడీ.. పవన్ స్పీచ్ అడ్డుకొని వారు వెంటనే కిందికి దిగాలని కోరారు. అలా ఎక్కడం వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చని హెచ్చరించారు.

New Update
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్పీచ్... ప్రధాని మోడీ గరం

Pawan Kalyan: చిలుకలూరిపేటలో టీడీపీ-జనసేన- బీజేపీ తొలి బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ క్రమంలో మొదటి స్పీచ్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇచ్చారు. ప్రధాని మోడీ ఏపీకి వచ్చిన భగీరధుడి అని అన్నారు. ఏపీని అభివృద్ధి చేసేందుకు.. జగన్ చేతిలో అప్పులో ఊబిలో చిక్కిన ఏపీని కాపాడేందుకు ప్రధాని మోడీ ఈ సభకు వచ్చి.. నేను ఉన్నాను అని భరోసా ఇచ్చారని అన్నారు. మోడీ మరోసారి ప్రధాని అవ్వడం ఖాయమని అన్నారు.

జగన్ పై గుస్సా..

సీఎం జగన్ పై విమర్శల వర్షం కురిపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఐదేళ్లు అధికారంలో ఉండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని మండిపడ్డారు. ఏపీ గంజాయి క్యాపిటల్‌గా మారిందని అన్నారు. జగన్ సీఎం కాదు..సారా వ్యాపారి అని ఎద్దేవా చేశారు. మోడీ పాంచజన్యం పూరించబోతున్నారని అన్నారు. ఏపీలో రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు.

పవన్ స్పీచ్ ఆపిన మోడీ..

పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా ప్రధాని మోడీ అడ్డుకున్నారు. సభకు వచ్చిన కొందరు కార్యకర్తలు అక్కడున్న లైట్స్ స్టాండ్ పైకి ఎక్కి కార్యక్రమాన్ని చూస్తున్నారు. దీన్ని గమనించిన ప్రధాని మోడీ పవన్ స్పీచ్ ను అడ్డుకొని వారు వెంటనే కిందికి దిగాలని కోరారు. కరెంట్ సరఫరా ఉండడం వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చని మోడీ అన్నారు. వెంటనే వారిని కిందికి దించాలని అక్కడున్న అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ప్రధాని.

Advertisment
తాజా కథనాలు