Budget 2024: మరికొన్ని గంటల్లో నిర్మలమ్మ బడ్జెట్...విశేషాలు ఇవే

మరికొన్ని గంటల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోడీ 3.0 సర్కార్ ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. దీనిపై ఈసారి రాష్ట్రాలతో పాటూ కోట్లాది మంది ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు.

Budget 2024: మరికొన్ని గంటల్లో నిర్మలమ్మ బడ్జెట్...విశేషాలు ఇవే
New Update

Union Budget 2024 : ఈరోజు ఉదయం 9 గంటలకు ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్‌కు నిర్మలా సీతారామన్ బయల్దేరి వెళ్లనున్నారు. ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అవుతారు. తర్వాత 10 గంటలకు పార్లమెంట్‌కు చేరుకుంటారు. ఉదయం 10.15 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. దీని తర్వాత ప్రధాని మోడీతో నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం ఉదయం 11 గంటలకు లోకసభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించనున్నారు. ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఇవి ముఖ్యాంశాలుగా ఉండనున్నాయి.

పన్ను రాయితీ ఉంటుందా?

నిర్మలా సీతారామన్ తన ఏడవ కేంద్ర బడ్జెట్ లో ఇండస్ట్రీలకు పన్ను రాయితీలు ఇవ్వడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి రంగాలలో స్థానిక సేకరణను ప్రోత్సహించే అవకాశం ఉంది. దీంతో పాటూ మధ్యతరగతి ప్రజల ఆశలకు అనుగుణంగా పన్ను రాయితీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మధ్యంతర బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలకు ఏమీ లభించలేదు కాబట్టి ఇప్పుడు వారి అంచనాలు భారీగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతంగా ఉన్న బడ్జెట్‌లో ద్రవ్య లోటు 4.5 శాతంగా ఉంది. ఇప్పుడు పూర్తి బడ్జెట్లో మునుపటి కంటే మెరుగైన ఆర్థిక లోటు అంచనాలను అందించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.

మౌలిక సదుపాయాల కల్పన..

మౌలిక సదుపాయాల కల్పనపై మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ ప్రణాళికాబద్ధ మూలధన వ్యయం (క్యాపెక్స్) ₹ 11.1 లక్షల కోట్లు ఉండగా.. గత ఆర్థిక సంవత్సరంలో ₹ 9.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ ప్రకటించింది. ఇప్పుడు ఫుల్ బడ్జెట్‌లో కూడా దీనికి సంబంధించి వరాల జల్లులు కురిపించొచ్చని చెబుతున్నారు. వినియోగ వస్తువుల తయారీదారులు, రియల్ ఎస్టేట్, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలతో పాటు మౌలిక సదుపాయాలు ఇంకా ఆటో కంపెనీలకు బడ్జెట్‌లో ప్రయోజనం చేకూరవచ్చని బ్రోకరేజీలు అంటున్నాయి.

సీనియర్ సిటిజన్ల ఆశలు..

ఇక మరోవైపు సీనిర్ సిటిజన్లు కూడా బడ్జెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. కరోనాకు ముందు రైల్వేలో సీనియర్ సిటిజన్లకు రాయితీ సౌకర్యం ఉండేది. కోవిడ్ తర్వాత దాన్ని కేంద్రం ఎత్తివేసింది. దీంతో అందరితో పాటు సమానంగా టికెట్ తీసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కొత్త బడ్జెట్‌లో మరోసారి సీనియర్ సిటిజన్స్ రాయితీలను పునరుద్ధరించొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కరోనాకు ముందు పురుష సీనియర్ సిటిజన్లు, మహిళా సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై భారీ రాయితీ లభించేది. మహిళా సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై 50 శాతం రాయితీ లభించగా.. పురుషులు, ట్రాన్స్‌జెండర్ సీనియర్ సిటిజన్లకు 40 శాతం రాయితీ ఉండేది. రాజధాని, శతాబ్ది సేవలతో సహా అన్ని ఎక్స్‌ప్రెస్, మెయిన్ రైళ్లకు కూడా ఈ తగ్గింపు వర్తించేది.

బడ్జెట్ ఆమోదం...

ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామ్ ప్రవేశపెట్టే కొత్త బడ్జెట్ ఈ నెల 30ను ఆమోదం పొందే అవకాశం ఉంది. దీనిపై ప్రతిపక్షాలు గట్టగానే వాదించాలని డిసైడ్ అయ్యాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కీలక రంగాల్లో వృద్ధి లేమి, వ్యవసాయ సంక్షోభంపై ఏయే అంశాలను లేవనెత్తాలనే దానిపై ప్రతిపక్ష నేతలు తమ చర్చల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్నాయని తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస ఛీఫ్ మల్లిఖార్జన ఖర్గే ట్విట్టర్‌లో ఒక పోస్ట్ కూడా చేశారు. మీ ప్రభుత్వం పదేళ్లలో 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను తుంగలో తొక్కింది. మోడీ ప్రభుత్వ వైఫల్యాలను చాటిచెప్పేందుకు ఆర్థిక సర్వే మెరిసే బోలు కవరు లాంటిది అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Also Read:Telangana: కొత్త క్రిమినల్ చట్టాలపై మీ వైఖరేంటి? – కేటీఆర్ బహింగ లేఖ



#budget-2024 #nirmala-sita-raman #finance-minister
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe