Artificial Intelligence: నెలకు రూ.3 నుంచి 9 లక్షలు సంపాదిస్తున్న ఏఐ మోడల్‌..

అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడకం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో స్పెయిన్‌కు చెందిన రూబెన్ క్రూజ్‌ అనే వ్యక్తి ఓ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆ ఏఐ మోడల్ పలు ఉత్పత్తులకు ప్రచారాలు చేస్తూ.. నెలకు ఏకంగా రూ.3 నుంచి రూ.9 లక్షల వరకు సంపాదిస్తోంది.

New Update
Artificial Intelligence: నెలకు రూ.3 నుంచి 9 లక్షలు సంపాదిస్తున్న ఏఐ మోడల్‌..

సాంకేతిక రంగం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రస్తుతం అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దూసుకుపోతుంది. అయితే ఏఐ వల్ల రాబోయే ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు కూడా వ్యక్తం అవుతుంది. పలువురు టెక్‌ దిగ్గజాలు కూడా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని సంస్థలు ఏఐని కంపెనీ సీఈవోగా, న్యూస్‌ రీడర్‌గా ప్రయోగత్మకంగా పరిశీలించాయి. ప్రస్తుతం పలు న్యూస్‌ ఛానల్లో ఏఐ న్యూస్‌ యాంకరే వార్తలు చదువుతోంది. అయితే తాజాగా స్పెయిన్‌కు చెందిన 'ద క్లూలెస్‌' సంస్థకు చెందిన రూబెన్ క్రూజ్‌ అనే వ్యక్తి ఐతానా లోపెజ్ అనే ఒక అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ను రూపొందించారు.

ఇప్పుడు ఈ ఏఐ మోడల్ పలు ఉత్పత్తులకు కూడా ప్రచారాలు చేస్తూ.. నెలకు ఏకంగా రూ.3 నుంచి రూ.9 లక్షల వరకు సంపాదిస్తోంది. దీన్ని రూపొందించిన రూబెన్ క్రూజ్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మోడల్స్, ఇన్‌ఫ్లూయెన్సర్లతో ప్రకటనలు చేయాలంటే ఇందుకు భారీగా ఖర్చు అవుతందని తెలిపారు. అలాగే వారితో వచ్చే క్రియేటివ్ సమస్యలతో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అందుకే ఖర్చులను తగ్గించేదుకు పరిష్కారంగా ఈ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేశామని వెల్లడించారు. ఈ మోడల్ తమకు ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని.. దాన్ని మా ప్రకటనల్లో చూసి చాలా మంది తమ ఉత్పత్తుల ప్రచారాల కోసం ఆ మోడల్‌ను వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు. తాము చెప్పినట్లుగా ఐతానా మోడల్ పని చేస్తుండటంతో దానికి బాగా డిమాండ్ పెరుగుతోందని చెప్పారు.

Also Read: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. రైతుబంధు పంపిణీకి బ్రేక్

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఐతానాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1,24 మంది ఫాలోవర్లు ఉన్నారని.. ఆ మోడల్ అచ్చం యువతిలాగే కనిపించడంతో కొంతమంది డేట్‌కు రావాలంటూ ఇన్‌స్టాలో మెసేజ్‌లు చేస్తున్నారని రుబెన్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాము చెప్పినట్లుగా పని చేస్తుండటంతో ఐతానాకు డిమాండు పెరుగుతోంది’ అని తెలిపారు. ఐతానాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.24 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. చూడటానికి అచ్చం యువతిలాగే ఉండటంతో.. చాలా మంది తమతో డేట్‌కు రావాలని ఇన్‌స్టాలో మెసేజ్‌లు పెడుతున్నారని రూబెన్‌ తెలిపారు.

Advertisment
తాజా కథనాలు