Andhra Pradesh: ఒంగోలు నియోజకవర్గంలో మరోసారి ఓట్ల లెక్కింపు..

ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 12 కేంద్రాల్లో మరోసారి ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు. ఈవీఎం ఓటింగ్ సరళిపై వైసీపీ అభ్యర్థి బాలినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 19 నుంచి 24వ తేదీ మధ్యలో ఈవీఎంల మాక్‌ పోలింగ్‌ను నిర్వహించనున్నారు.

New Update
Andhra Pradesh: ఒంగోలు నియోజకవర్గంలో మరోసారి ఓట్ల లెక్కింపు..

ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల మాక్‌ పోలింగ్ నిర్వహించనున్నారు. వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని తనకు ఈవీఎం ఓటింగ్ సరళిపై అనుమానాలు ఉన్నట్లు అభ్యంతరం తెలిపారు. మరోసారి మాక్ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇందుకోసం రూ.5 లక్షల 44 వేలు చెల్లించారు. ఈ నేపథ్యంలోనే 12 పోలింగ్‌ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలో మాక్‌ పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నహాలు చేస్తోంది.

Also Read: వారికి రూ.5 లక్షలు.. మంత్రి కీలక ప్రకటన

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి 26 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్ విజయం సాధించారు. ఆ నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడులేని విధంగా 34,060 ఓట్ల మెజార్టీతో ఆయన వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై గెలిచారు. అయితే ఈ ఓటింగ్ సరళిపై బాలినేని అనుమానాలు తలెత్తడంతో ఈవీఎంల మాక్ పోలింగ్ నిర్వహణ చేపట్టాలని కోరారు. మాక్‌ పోలింగ్ కోసం ఇప్పటికే కలెక్టర్ తమీమ్ అన్సారియా హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నారు. ఈ క్రమంలోనే మే 13న జరిగిన ఎన్నికల్లో వినియోగించిన 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు. ఆగస్టు 19 నుంచి 24వ తేదీ మధ్యలో ఈవీఎంల మాక్‌ పోలింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు