MMTS Trains: రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు!

దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషనలో జరుగుతున్న అభివృద్ది పనుల కారణంగా శని, ఆదివారాల్లో వెళ్లాల్సిన కొన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.రైల్వే ప్రయాణికులు ఇతర రవాణా మార్గాలను ఎంచుకోవాలని అధికారులు తెలిపారు.

New Update
MMTS Trains: రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు!

MMTS Trains: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషనలో జరుగుతున్న అభివృద్ది పనుల కారణంగా శని, ఆదివారాల్లో వెళ్లాల్సిన కొన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులు ఇతర రవాణా మార్గాలను ఎంచుకోవాలని అధికారులు తెలిపారు. సోమవారం నుంచి ప్రయాణికులకు యథావిధిగా ఎంఎంటీఎస్‌ రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు

అధికారులు రద్దు చేసిన ఎంఎంటీఎస్‌ రైళ్లు వివరాలు ఇలా ఉన్నాయి. రైలు నం. – 47177 (రామచంద్రపురం – ఫలక్‌నుమా), రైలు నెం – 47156 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్), రైలు నం. – 47185 (సికింద్రాబాద్ – ఫలక్‌నుమా), రైలు నెం. – 47252 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్)
రైలు నం. – 47243 (సికింద్రాబాద్ – మేడ్చల్), రైలు నం. – 47241 (మేడ్చల్ – సికింద్రాబాద్), రైలు నెం – 47250 (సికింద్రాబాద్ – ఫలక్‌నుమా), రైలు నెం – 47201 (ఫలక్‌నుమా – హైదరాబాద్), రైలు నెం – 47119 (హైదరాబాద్ – లింగంపల్లి), రైలు నెం – 47217 (లింగంపల్లి – ఫలక్‌నుమా), రైలు నెం. – 47218 (ఫలక్‌నుమా – రామచంద్రపురం) ఈ వివరాలను ప్రయాణికులు గుర్తించాలని అధికారులు తెలిపారు.

Also read: పవన్‌కు మావోయిస్టుల ముప్పు!

Advertisment
తాజా కథనాలు