SSMB29 : రాజమౌళి - మహేష్ సినిమాపై కీరవాణి అప్డేట్.. 'SSMB29' మరింత ఆలస్యం?

MM కీరవాణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో 'SSMB29' ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు.మహేశ్-రాజమౌళి సినిమా స్టోరీ లాక్ అయిపోయింది. నేను ఇంకా మ్యూజిక్ వర్క్ ప్రారంభించలేదు. కొన్ని టెస్ట్ షూట్స్ చేస్తున్నారు. జూలై లేదా ఆగస్టులో నా పని మొదలుపెడతాను' అంటూ చెప్పుకొచ్చారు.

SSMB29 : రాజమౌళి - మహేష్ సినిమాపై కీరవాణి అప్డేట్.. 'SSMB29' మరింత ఆలస్యం?
New Update

MM Keeravani About SSMB29 : దర్శకధీరుడు రాజమౌళి (Rojamouli) - సూపర్ స్టార్ మహేశ్‌బాబు కాంబోలో భారీ ప్రాజెక్ట్‌ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా #SSMB 29 గా రాబోతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే మూవీ నుంచి అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ పాటికే సినిమాను లాంచ్ చేయాల్సింది.

కానీ ఏమైందో తెలీదు ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటిదాకా ఎలాంటి అప్డేట్ లేదు. మహేష్ మాత్రం జక్కన్న తన లుక్ మొత్తాన్ని మార్చుకొని, జిమ్ లో భారీ కసరత్తులు చేస్తూ సినిమా కోసం సన్నద్దమవుతున్నాడు. ఇలాంటి తరుణంలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి కీరవాణి (MM Keeravani) తాజా ఇంటర్వ్యూల్లో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

Also Read : ‘కల్కి’ ఓటీటీ రిలీజ్ విషయంలో బిగ్ ట్విస్ట్.. సినిమా చూడాలంటే అన్ని వారాలు ఆగాల్సిందే?

స్టోరీ లాక్ అయింది...

తాజా ఇంటర్వ్యూలో కీరవాణి SSMB29 ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.."మహేశ్ (Mahesh Babu) - రాజమౌళి సినిమా స్టోరీ లాక్ అయిపోయింది. నేను ఇంకా మ్యూజిక్ వర్క్ ప్రారంభించలేదు. కొన్ని టెస్ట్ షూట్స్ చేస్తున్నారు. జూలై లేదా ఆగస్టులో నా పని మొదలుపెడతాను" అంటూ చెప్పుకొచ్చారు. ఆయన చెప్పినదాన్ని బట్టి చూస్తే ఇప్పుడు టెస్ట్ షూట్ చేస్తున్నారంటే షూటింగ్ మొదలయ్యేసరికి ఈ ఏడాది చివర లేదంటే వచ్చే ఏడాది అయిపోవచ్చు. ఇక సినిమా అంతా పూర్తవ్వడానికి నాలుగేళ్ళయినా పట్టొచ్చేమో. కనీసం ఆగస్టులో మహేష్ బర్త్ డే కైనా ఈ మూవీ అప్డేట్ ఇస్తారో లేదో చూడాలి.

#mm-keeravani #ssmb29-movie #mahesh-babu #ss-rajamouli
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe