MLC Kavitha: త్వరలో కవిత పాదయాత్ర.. వారికి చెక్ పెట్టేలా కేసీఆర్ యాక్షన్‌ప్లాన్! బీర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. తనపై లిక్కర్ కేసు ముద్ర తొలగించుకోవడంతోపాటు తమ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కేసీఆర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్, బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. By B Aravind 29 Aug 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి MLC Kavitha: బీర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అంశం, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించే ఆలోచనలో భాగంగానే పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా దాదాపు ఐదు నెలల తర్వాత తీహార్ జైలునుంచి మంగళవారం విడుదలై కవిత.. గురువారం తండ్రి కేసీఆర్‌ను ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ సూచనల మేరకు కవిత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం.. మరోవైపు తాను ఎలాంటి తప్పుచేయలేదని, కేవలం రాజకీయ కక్షతోనే తనను జైలు పాలుచేశారని కవిత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి తనపై ఉన్న రిమార్క్ ను చెరిపేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో పూర్తిగా దివాలా తీసిన బీఆర్ఎస్ పార్టీలో మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తన పాదయాత్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్, బీజేపీలకు చెక్ పెట్టేందుకు త్వరలోనే కేసీఆర్ యాక్షన్‌ప్లాన్ మొదలుపెట్టాడని, అందులో భాగంగానే మొదట కవిత పాదయాత్రతో మొదలుపెట్టి ఆ తర్వాత సీన్‌లోకి దిగి మరింత దూకుడుగా వెళ్లాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. #brs-mlc-kavita #kcr #telangana-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి