Kavitha : రేవంత్‌ సీఎం అవ్వడం మన ఖర్మ.. సీతక్కకు ఇచ్చిన మాట ఏమైంది?: కవిత

సీతక్కకు డిప్యూటీ సీఎం ఇస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారని కవిత గుర్తు చేశారు. మహిళ అయిన సీతక్కకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత. రేవంత్‌ పాలన అవగాహన లోపంతో కూడుకున్నదని విమర్శించిన కవిత.. అలాంటి సీఎం ఉండడం మన ఖర్మ అని ఫైర్ అయ్యారు.

New Update
Kavitha : రేవంత్‌ సీఎం అవ్వడం మన ఖర్మ.. సీతక్కకు ఇచ్చిన మాట ఏమైంది?: కవిత

Kavitha Comments on CM Revanth Reddy : భారత జాగృతి ఆధ్వర్యంలో రేపు ఇందిరా పార్క్(Indira Park) వద్ద ధర్నా జరగనుంది. జీవో-3(G.O-3) రద్దు చేయాలని భారత జాగృతి డిమాండ్ చేస్తోంది. దీనిపై ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. జీవో 3 వల్ల ఉద్యోగాల్లో మహిళలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం వాటా రావాల్సిందేనని చెప్పారు. రేపు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పోలిస్ పర్మిషన్ ఇవ్వలేదని తెలిపారు. పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామన్నారు కవిత. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) అధికారంలో ఉన్నప్పుడే బతుకమ్మ ఆడేందుకు కోర్టుకు వెళ్లి పర్మిషన్ తీసుకున్నామని.. ప్రజలకు పనికిరాని రాజకీయ నాయకులు ఉన్నారంటూ కవిత ఫైర్ అయ్యారు.

సీతక్కకు ఇచ్చిన మాట ఏమైంది?
సీతక్కకు(MLA Seethakka) డిప్యూటీ సీఎం ఇస్తామని హామీ ఇచ్చారని కవిత గుర్తు చేశారు. మహిళ అయిన సీతక్కకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాని కవిత రేవంత్‌కు కౌంటర్లు వేశారు. అనుభవరాహిత్యం, అవగాహన లోపం సీఎం రేవంత్(CM Revanth Reddy) పాలనలో కనిపిస్తుందని ఆరోపించారు. అలాంటి ముఖ్యమంత్రి ఉండడం మన ఖర్మ అని తెలిపారు. లిక్కర్ కేసు అసలు పెద్ద కేసే కాదన్నారు కవిత, ఈ కేసును టీవీ సీరియల్ కేసు లెక్క లాగుతున్నారని.. ఈ కేసును తన లీగల్ టీం చూసుకుంటుందన్నారు. తాను బాధితురాలిని...ఫైట్ చేస్తానని చెప్పారు కవిత. ఆదర్శ్ కుంభకోణం ఏమైందని ప్రశ్నించారు.

టీడీపీదే ఎజెండా:
రెండు జాతీయ పార్టీలు కలిపి ప్రాంతీయ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని కవిత(MLC Kavitha) ఆరోపించారు. బీఎస్పీతో పొత్తు కేసీఆర్(KCR) నిర్ణయమని.. ఎన్నికల నాటికి ఇంకెవరైనా రావొచ్చని చెప్పారు. కేసీఆర్ వ్యూహం ఎలా ఉన్నదో తెలియదని.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) గతంలో మాట్లాడిన మాటలకు రాజకీయాల్లో సమాధానాలు ఉండవన్నారు కవిత. కేసీఆర్ పట్ల రేవంత్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడుతుండని.. రేవంత్ రెడ్డి మానసిక స్థితి ఆయనకే వదిలేస్తామని చురకలంటించారు కవిత. రేవంత్ రెడ్డి మాట్లాడే భాషా ప్రజలు గమనిస్తున్నారని.. రేపు ధర్నా కార్యక్రమానికి పర్మిషన్ ఇస్తే ప్రభుత్వానికి మర్యాద ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేరుకే కాంగ్రెస్ పార్టీది... ఎజెండా మొత్తం టీడీపీ(TDP) దేనని దుయ్యబట్టారు కవిత.

Also Read : వైసీపీకి బిగ్‌ షాక్‌..ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ రాజీనామా!

Advertisment
తాజా కథనాలు