MLC Kavitha: అలా ఎందుకు చేశారు.. మాజీ ఎమ్మెల్యేలపై కవిత ఫైర్..

పార్టీ కార్యకర్తలను అధిష్ఠాన నేతలు కలవకుండా కొందరు నేతలు అడ్డుపడ్డారంటూ మాజీ ఎమ్మెల్యేలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ లోక్‌సభ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే రకరకాల అడ్డంకులు సృష్టించారంటూ మండిపడ్డారు.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి కస్టడీ పొడిగింపు
New Update

నిజామాబాద్ లోక్‌సభ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను అధిష్ఠాన నేతలు కలవకుండా అడ్డుపడ్డ కొందరు నేతలు అంటూ మాజీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. తాను స్వయంగా కార్యకర్తలను కలిసేందుకు వస్తే.. రకరకాల అడ్డంకులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో మనం ఓడిపోయామంటే పార్టీ పనితీరుపై నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. లేకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. నిజామాబాద్‌లో ఎంపీ సీటు గెలిచి కేసీఆర్‌కు గిఫ్ట్ ఇవ్వాలంటూ వ్యాఖ్యానించారు.

Also Read: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే.. సొంత నిధులతో భూమిపూజ

ఇదిలాఉండగా మరోవైపు మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఈ ఎన్నికలపై తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అయితే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్సీ కవిత బరిలోకి దిగనుండగా.. అటూ బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ కూడా మరోసారి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి కూడా సిట్టింగ్ ఎంపీలు బరిలోకి దిగాలని వ్యాఖ్యానించడంతో ధర్మపురి అరవింద్ పోటీ చేయడం అనివార్యం కానుంది.

2014లో నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన కవిత.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. నిజామాబాద్‌, జగిత్యాల ప్రాంతంలో పసుపు రైతులు కవితపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. పసుపు బోర్డు తీసుకొస్తానని మాటిచ్చి మోసం చేశారంటూ మండిపడ్డారు. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో తాను గెలిచిన ఐదు రోజులకే పసుపు బోర్డు తీసుకొస్తానంటూ హమీ ఇచ్చారు. కానీ ఇంతవరకు నిజామాబాద్‌కు పసుపు బోర్డు రాలేదు. ఈ నేపథ్యంలో ధర్మపురి అరవింద్‌పై కూడా ఇటీవల పసుపు రైతులు నిరసనలు తెలిపారు.

Also Read: ‘పప్పులు ఉడకడం కాదు బిర్యాని కూడా ఉడుకుతుంది’..హరీష్ రావ్ కు బండ్ల గణేష్ కౌంటర్..

ఇటీవల తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ.. రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మరోసారి పసుపు రైతుల్లో ఆశలు చిగురించాయి. కానీ ఓసారి బీజేపీ మాట తప్పడంతో మళ్లీ ఈసారి ఆ పార్టీని నమ్ముతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈసారి కూడా లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ- బీఆర్‌ఎస్ మధ్య గట్టి పోటీ ఉండనుంది. మరి ఈసారి నిజామాబాద్ వాసులు ఎవరిని గెలిపిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజుల పాటు వేచిచూడాల్సిందే.

#nizamabad #brs #brs-mlc-kavitha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe