Kavitha: విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు.. ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని అన్నారు ఎమ్మెల్సీ కవిత. పూర్తిస్థాయి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం ఇలాంటి అనేక సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేకపోతుందని మండిపడ్డారు. By V.J Reddy 18 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి MLC Kavitha: గురుకుల పాఠశాలలో బాలికలు చనిపోవడంపై స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సూర్యాపేట మండలం ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని అన్నారు. ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు కొద్ది కాలం వ్యవధిలోని ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఏం జరుగుతోంది ? అని ఆమె ప్రశ్నించారు. విద్యార్థులు ఎందుకు ఇలా వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ? అని అడిగారు. పూర్తిస్థాయి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడం ఇలాంటి అనేక సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేకపోతుందని మండిపడ్డారు. తక్షణమే పూర్తిస్థాయి సంక్షేమ శాఖ మంత్రిని నియమించడంతో పాటు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని మనవి చేశారు. ALSO READ: కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే.. మాజీ మంత్రి నిరంజన్ కీలక వ్యాఖ్యలు సూర్యాపేట మండలం ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు కొద్ది కాలం వ్యవధిలోని ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఏం జరుగుతోంది ? విద్యార్థులు ఎందుకు ఇలా వరుసగా… — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 18, 2024 అసలేమైంది.. తెలంగాణలో గురుకుల విద్యార్ధుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. ఇటీవలే సూర్యపేటలోని ఇమాంపేట గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాగా మరోసారి అదే పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ హాస్టల్ లో పదో తరగతి చవుదుతున్న ఇరుగు అస్మిత ( 15) అనే బాలిక ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయింది. పదవ తరగతి విద్యార్థిని.. ఈ మేరకు పోలీసులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతె మండలం బురకచర్ల గ్రామ పరిధికి చెందిన ఇరుగు ఆనంద్ జ్యోతిల కూతురు ఇరుగు అస్మిత ప్రస్తుతం ఇమాంపేట గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అయితే ఇటీవల అదే గురుకులకు చెందిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కళాశాలలో ఫేర్వెల్ పార్టీ రోజు ఉరివేసుకొని చనిపోంది. దీంతో విద్యార్ధులు భయపడకుండా స్కూల్ కి కొన్నిరోజులు సెలవులు ప్రకటించారు. ఈ క్రమంలోనే సెలవులపై ఇంటికి వచ్చిన అస్మిత ఇవ్వాళ పాఠశాలకు వెళ్లాల్సి ఉండగా వెళ్లలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో హైదరాబాద్ లోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కూతురు ఆకస్మిక మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అనుమానాలకు తావిస్తోంది.. అయితే ఈ 15 రోజుల్లోనే నలుగురు గురుకు బాలికలు ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. భువనగిరి ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో భవ్య, వైష్ణవి అనుమానాస్పద మృతి చెందగా.. ఆ కేసు కొలిక్కి రాకముందే, సూర్యాపేట గురుకుల ఎస్సీ హాస్టల్లో ఉండే వైష్ణవి, అస్మిత అనే మరో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. DO WATCH: #congress #mlc-kavitha #brs-party #gurukulam-suicide-girl మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి