MLC Kavitha Reaction On Delhi Liquor Scam Case: డిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఈ రోజు ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచింది. అయితే.. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఇది అక్రమ కేసు అని అన్నారు. రాజకీయ కుట్రతోనే తనపై కేసు పెట్టారన్నారు. దీనిపై న్యాయపరంగా పోరాడుతున్నట్లు చెప్పారు. గత ఏడాది అడిగిన ప్రశ్నలనే విచారణలో మళ్లీ అడిగారన్నారు. మరో వైపు కవితను మరో 5 రోజులు విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. ఇరు వర్గాల మధ్య వాదనలు జరగగా కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కవిత తన పిల్లలతో మాట్లాడేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. తనకు హైబీపీ ఉందని.. తన మెడికల్ రిపోర్టులు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లోని కవిత ఆడపడుచు నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కవిత కస్టడీ పొడిగిస్తే ఈ ఇద్దరిని కలిపి ఈడీ విచారించే అవకాశం ఉంది.