MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి కస్టడీ పొడిగింపు

TG: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరోసారి రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. జులై 7 వరకు పొడగిస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

New Update
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి కస్టడీ పొడిగింపు

MLC Kavitha Custody Extended: లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరోసారి రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. జులై 7 వరకు పొడగిస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) సీబీఐ కేసులో నేటితో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగుస్తున్న క్రమంలో ఆమెను వర్చువల్ గా కోర్టులో హాజరు పరిచారు అధికారులు. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ (ED) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదే కేసులో కేజ్రీవాల్ కు షాక్.. 

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు (CM Kejriwal) షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ఇచ్చిన బెయిల్‌ను హోల్డ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. నిన్న షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇవ్వడంపై ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్ రద్దు చేయాలని.. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరింది. దీంతో తాజాగా హైకోర్టు కేజ్రీవాల్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను నిలిపివేసింది. 

Also Read: ప్రైవేట్ కాలేజీలో ఫుడ్‌ పాయిజన్‌..40 మంది విద్యార్థులు..!

Advertisment
తాజా కథనాలు