MLC Kavitha: తీహార్ జైలు అధికారుల తీరుపై కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇంటి భోజనాన్ని అనుమతించడం లేదని పేర్కొన్నారు. పరుపులు, చెప్పులు కూడా అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కళ్లజోడు కూడా అనుమతించడం లేదని వాపోయారు. పెన్ను, పేపర్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బట్టలు, బెడ్‌షీట్స్, బుక్స్ అనుమతించడం లేదని అన్నారు. కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. జైలు సూపరిండెంట్‌కు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎల్లుండి విచారిస్తామని రౌస్ ఎవెన్యూ కోర్టు పేర్కొంది.
MLC Kavitha: ఇంటి భోజనం ఇవ్వట్లేదు.. కోర్టులో కవిత పిటిషన్!
తనకు జైలులో తినడానికి ఇంటి భోజనం అనుమతించడం లేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు.
Translate this News: