/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/GF-kB3GXwAAu_JC-jpg.webp)
MLC Jeevan Reddy: ఉత్తర తెలంగాణలో (North Telangana Area) ఎక్కువ మంది నిరుద్యోగ యువత గల్ఫ్ దేశాలపై ఆధారపడి ఉన్నారని, వారి సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో (Congress Manifesto) ఇచ్చిన వాగ్దానం మేరకు సమగ్ర ఎన్నారై పాలసీ, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి శనివారం శాసన సభ ఆవరణలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) వినతిపత్రం అందజేశారు.
ALSO READ: సీఎం అయ్యేందుకు హరీష్ 5వేల కోట్ల స్కాం.. జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు
గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబాలకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ఇచ్చిందని, శంషాబాద్ విమానాశ్రయం నుండి స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఉచిత అంబులెన్స్ సేవలను అందించిందని పేర్కొన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్ళలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ ఇతర నాయకులు ఇదివరకే ఈ విషయాన్ని మీ దృష్టికి తెచ్చారని జీవన్ రెడ్డి వవివరించారు.
ఎన్నారై పాలసీ, గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి
● సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వినతిపత్రం
ఉత్తర తెలంగాణలో ఎక్కువ మంది నిరుద్యోగ యువత గల్ఫ్ దేశాలపై ఆధారపడి ఉన్నారని, వారి సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎన్నికల ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు సమగ్ర ఎన్నారై పాలసీ,… pic.twitter.com/YvfCz53SxW
— T Jeevan Reddy MLC (@jeevanreddyMLC) February 10, 2024
DO WATCH: