MLA సంజయ్ సిగ్గుంటే...MLC Jeevan Reddy Demands To Sanjay Kumar MLA Post Resign | RTV
TG: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తన ప్రమేయం లేకుండా జరగాల్సింది జరిగిందని అన్నారు. పార్టీ మారే ఆలోచన లేదని.. కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు.
TG: కాంగ్రెస్ వస్తే రామాలయాన్ని కూల్చేస్తారని మోదీ ప్రచారం దారుణం అని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అయోధ్యలో రామాలయం గేట్లు తెరిపించిందే రాజీవ్‌గాంధీ ప్రభుత్వం అని అన్నారు. రాజీవ్‌గాంధీ బతికుంటే రామాలయం నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదని పేర్కొన్నారు.
ఎన్నారై పాలసీ, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శాసన సభ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్ళలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.
సాగునీటి రంగంలో కాళేశ్వరం, తాగునీటి రంగంలో మిషన్ భగీరథ రెండు స్కీంలు విఫలం అయ్యాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండేవారికి ప్రత్యేకంగా ప్రచారం అవసరం ఉండదన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది కాబట్టి ప్రజలతో మమేకం కావాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలే కాంగ్రెస్ ను గెలిపించబోతున్నాయని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.