MLC Elections : వారికి కాంగ్రెస్ షాక్.. వీరికే ఎమ్మెల్సీ టికెట్?

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. అద్దంకి దయాకర్, మహేష్ గౌడ్ పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. షబ్బీర్అలీ, ఫిరోజాఖాన్ పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని సమాచారం.

New Update
Telangana Congress: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కమిటీ భేటీ

Congress MLC List : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు(MLC Elections) సంబంధించి నోటిషికేషన్‌ను నిన్న(గురువారం) ఎన్నికల సంఘం విడుదల చేయడంతో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈనెల 18 వరకు అభ్యర్ధులు నామినేషన్లు చేసుకోవచ్చును. మర్నాడు అంటే 19వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. అక్కడి నుంచి మరో మూడు రోజులలోపు అంటే జనవరి 22లోపు నామినేషన్ల ఉపసంహరణ. జనవరి 29న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. ఇక అదే రోజు ఫలితాలను కూడా వెలువడనున్నాయి.

ALSO READ: తెలంగాణ భవన్‌లో దొంగలు.. బీఆర్ఎస్ నేత జేబులో నుంచి రూ.12 వేలు లూటీ!

రెండు రోజుల్లో లిస్ట్..

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్(Congress) సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. రెండు స్థానాలూ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశమున్న నేపథ్యంలో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర పార్టీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ(Deepa Das Munshi) ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభిప్రాయం తీసుకుని అధిష్టానానికి నివేదించారని సమాచారం. లోక్ సభ(Lok Sabha) సమన్వయకర్తల సమావేశం కోసం ఢిల్లీ(Delhi) వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కూడా అధిష్టానం పెద్దలు ఈ విషయమై చర్చించి ఆయన అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల కోసం ఎస్సీ, బీసీ, మైనార్టీల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

అద్దంకి దయాకర్‌కు గ్రీన్ సిగ్నల్?

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) టికెట్ ఆశించి భంగపడ్డ తుంగతుర్తి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ రేవంత్ మంత్రివర్గం లో కచ్చితంగా స్థానం లభిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని గాంధీ భవన్ లో టాక్ వినిపిస్తోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన బీసీ వర్గాలకు చెందిన నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ పేరు కూడా దాదాపు ఖరారైందని సమాచారం. వీరిద్దరితో పాటు మైనార్టీ కోటాలో షబ్బీర్అలీ, ఫిరోజాఖాన్ పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని తెలుస్తోంది.

కోటి ఆశలతో కోదండరాం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ప్రకటించిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండ రాం ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ వైపు ఆశగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ కీలక పదవి కోదండ రాం కు ఇస్తున్నట్లు ప్రచారం జరగగా.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే.. తనను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి కోదండ రాం కోరినట్లు తెలుస్తోంది. మరి కోదండ రాంకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.

ALSO READ: ఈ రోజు నుంచి స్కూళ్లకు సెలవులు

Advertisment
తాజా కథనాలు